MCA – మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రివ్యూ

MCA మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రివ్యూ,MCA Movie Review,Telugu Filmnagar,Telugu Movies News 2017,Telugu Film News,Latest Tollywood Cinema Updates,Middle Class Abbayi Telugu Movie Review,Middle Class Abbayi Movie Review & Rating,Nani MCA Movie Story,Natural Star Nani MCA Telugu Movie Live Updates,MCA Telugu Movie Review,MCA Movie Public Talk,MCA Telugu Movie Public Response
MCA Movie Review
సినిమా : మిడిల్ క్లాస్ అబ్బాయి
నటీనటులు : నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల
దర్శకత్వం : వేణు శ్రీరామ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

కథ : నాని, రాజీవ్ కనకాల ఆనందంగా తమ జీవితాన్ని గడిపే ఇద్దరు అన్నదమ్ములు. రాజీవ్ కు భార్యగా నానికి వదినగా భూమిక కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక వదినతో నానికి ఎప్పుడు ఎదోక విషయంలో చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. నాని మాత్రం ఇంట్లో వదినపై ఆధిపత్యం కోసం తపిస్తుంటాడు. ఇంతలో రాజీవ్..ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్లడం, ఇటు భూమికకు RTO గా వరంగల్ కు బదిలీ అవ్వడం జరుగుతుంది. అక్కడే నానికి సాయి పల్లవి పరిచయం అవ్వడం, మరోవైపు అక్కడి లోకల్ ట్రాన్స్ పోర్ట్ మాఫియాతో భూమికకు బెదిరింపులు రావడం మొదలవుతాయి. మరి ఈ పరిస్థితుల్లో నాని తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు ? సాయి పల్లవి ప్రేమ చివరకి ఏమైందని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమా ఆరంభంలో మంచి ఎంటర్ టైన్మెంట్ అంశాలతో సినిమాను రాసుకుని సఫలమయ్యారు. నానిని జాబ్ లేని మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఫన్నీ యాంగిల్లో బాగా ప్రోజెక్ట్ చేశాడు. అలాగే వదిన భూమికతో గొడవపడటం..ఆమెకు వంట గదిలో సహాయం చేయడం, పాల పాకెట్స్ తీసుకురావడం వంటివి చాలా రియాలిటీగా అచ్చం మధ్య తరగతిలో జరిగేవిగా ఉన్నాయి. అలాగే వరంగల్ వెళ్ళాక సాయి పల్లవితో వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. ఇద్దరి జంట స్క్రీన్ పై చాలా బాగా పండిందనే చెప్పాలి. ఇక మధ్యలో మాఫియా రౌడీ బెదిరించే తీరు ప్రేక్షకులకు అంతా కనెక్ట్ కాకపోవచ్చు. కారణం విలన్లో అంత ఇంటెన్సిటీ లేకపోవడమే అని చెప్పాలి. ప్రీ ఇంటర్వెల్ లో నానిపై వదిన భూమిక ఆలోచిస్తున్న తీరు మాత్రం అందరి చేత విజిల్స్ వేయిస్తుంది. సో మొత్తంగా ఫస్ట్ ను నాని తన భుజాలపై వేసుకుని మోశాడనే చెప్పాలి.

ఇక సెకండ్ మొత్తంగా రన్ అండ్ ఛేజ్ గేమ్ లాగ ఫన్నీ స్టయిల్లో డిజైన్ చేశాడు. ఈ సీన్స్ రెగ్యులర్ ఆడియన్సు కు కనెక్ట్ కాకపోయినా..ఫ్యామిలీ ఆడియన్సు
మాత్రం థియేటర్లకు రప్పిస్తాయి. భూమిక కెరియర్లో ఇంత క్యారెక్టర్ ఆమెకి రాలేదని చెప్పాలి. సినిమాలో చాలా కీలకంగా సాగింది. పాటల విషయానికొస్తే కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టు, ఏవండోయ్ నాని గారు స్క్రీన్ మీద చాల బావున్నాయి.

నటీనటుల పనితీరు : ఈ సినిమా వెన్నుముక లాగ నిలిచిందంటే ఇద్దరే ఇద్దరు ఒకటి నాని, రెండు భూమిక. నాని తన న్యాచురల్ యాక్టింగ్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల జీవితాలను బాగా ప్రతిబింబించాడు. భూమిక వదిన పాత్రలో నానికి ధీటుగా మంచి పాత్ర దొరకడంతో బాగా చేసింది. సాయి పల్లవికి సినిమాలో బలమైన పాత్ర లేనప్పటికీ ఉన్నతంలో నిరాశపరచకుండా చేసింది. రాజీవ్ కనకాల, ప్రియదర్శి, పవిత్ర లోకేష్, నరేష్ లు తమ పాత్రల మేరకు బాగానే చేశారు.

సాంకేతిక విభాగం : దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాని నాని శైలికి తగినట్టు మంచి ఎంటర్ టైనింగ్ అంశాలతో రాసుకోవోడం బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు బావున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్తా ఎఫెక్టివ్ గా ఉంటె బాగుండేది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే..అనవసరపు సన్నివేశాలు లేకుండా కరెక్ట్ గా కట్ చేశాడు. దిల్ రాజు పాటించిన నిర్మాణ విలువలు మెచ్చుకునేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నాని
భూమిక
సాయి పల్లవి
ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సీన్స్, డైలాగ్స్
వదిన, మరిదిల మధ్య బంధం వైవిధ్యంగా ఉండడం

నెగటివ్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
పస లేని బ్యాక్ గ్రౌండ్ స్కోర్

చివరగా : MCA – మిడిల్ క్లాస్ అబ్బాయి, నాని న్యాచురల్ యాక్టింగ్ తో క్లీన్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో..వదిన, మరిదిల మధ్య గల బంధాన్ని అందంగా చెప్పిన సినిమా. రెగ్యులర్ ఆడియన్సు మరియు ఫ్యామిలీ ఆడియన్సు ని తప్పకుండా మెప్పించే మంచి సినిమా ఈ ఎంసిఏ.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Xct31xZrk58]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here