హే పిల్లగాడా మూవీ రివ్యూ

హే పిల్లగాడా మూవీ రివ్యూ,Telugu Filmnagar,Tollywood Movies News,Telugu Film News 2017,Telugu Cinema Updates,Latest Telugu Movie Reviews 2017,Tollywood Latest Film Reviews,Hey Pillagada Movie Review,Hey Pillagada Telugu Movie Review,Sai Pallavi Hey Pillagada Review,Hey Pillagada Movie Review & Rating,Hey Pillagada Movie Public Talk,Hey Pillagada Telugu Movie Public Response,Hey Pillagada Movie Story,Hey Pillagada Telugu Movie Live Updates

సినిమా : హే పిల్లగాడా
నటీనటులు : దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి
దర్శకత్వం : సమీర్ తాహీర్
సంగీతం : గోపీ సుందర్
నిర్మాత : DV కృష్ణ మూర్తి

కథ :

దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కాలేజీ రోజుల నుండే ప్రేమించుకుని ఒక స్టేజికి వచ్చాక ఒకరికొకరికి ఇష్టంతో పెళ్లి చేసుకుంటారు. కానీ దుల్కర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మనస్తత్వం ఉన్నవాడు. ఇదే క్రమంలో దుల్కర్ ఓ బ్యాంకు లో ఉద్యోగం సంపాదించి లైఫ్ ను సంతోషంగా సాయి పల్లవితో కలిసి గడుపుతుంటాడు. ఇతనికి ప్రతి చిన్న విషయానికి పట్టరాని కోపం వస్తుండడం మూలాన…ఆ అలవాటుని ఎలాగైనా మార్చాలని సాయి పల్లవి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి ఓ చిన్న ప్రైవేట్ పార్టీకి వెళ్తారు. అక్కడి జరిగిన చిన్న తప్పిదం వల్ల దుల్కర్ ఒకరిపై చేయి చేసుకుంటాడు. అలా జరగడంతో సాయి పల్లవి ఎంతో బాధతో విరక్తితో అంత రాత్రి వేళా దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుని బయటికి వచ్చేస్తుంది. ఇలా అనుకోని పరిస్థితుల్లో కథలో కీలక మలుపు తిరుగుతుంది. అసలు చివరికి ఏమైంది ?, దుల్కర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాడా ? సాయి పల్లవి చివరికి ఏమైంది అని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

దర్శకుడు సమీర్ తాహిర్ ఈ సినిమాని చాలా ఇంటెలిజెంట్ గా అనుక్షణం ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడంలో సఫలం అయ్యాడు. అలాగే హీరోకి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఎవరితో కలవకుండా ఉండే పాత్రను బాగా రాసుకుని..ఎం జరుగుతుంది అనే భయాన్ని కలిగించి..సాయి పల్లవితో లవ్ ట్రాక్, పెళ్లి చేసుకోవడం..వారి వైవాహిక జీవితంలో ఏర్పడుతున్న మార్పులను బాగా చూపించి సినిమాలో నెక్స్ట్ ఎం జరుగుతుంది అనే ఆసక్తిని బాగా రేకెత్తించాడు. అలాగే ఇంటర్వెల్ ముందే జరిగే కీలక సన్నివేశం..సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలను పెంచేసింది.

చెంబన్ వినోద్ కథలోకి ఎంటర్ అవ్వగానే..ప్రేక్షకుడిని పూర్తిగా సినిమాలోకి తీసుకెళ్లింది. ఫారెస్ట్ లో జరిగే రేసీ సీన్స్ సీట్ కి అతుక్కుని చూసేలా ఉన్నాయి. అలాగే సాయి పల్లవికి కార్ డ్రైవింగ్ సరిగా రాదు అనే పాయింట్ నుండి కథను ముందుకు నడిపించడం చాలా బాగుంది. అలాగే దుల్కర్ సల్మాన్ కోపం వల్ల ఇంతటి విధ్వంసానికి దారి తీసిందా అని ఆలోచింప చేసేలా దర్శకుడు అద్భుతమైన థ్రిల్లర్ ని తలపించేలా తెరకెక్కించాడు.

నటీనటులు పనితీరు :

సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ లు తమ పాత్రల్లో జీవించేశారనే చెప్పాలి. దుల్కర్ కొన్ని సన్నివేశాల్లో..బయపెట్టాలంటే కేవలం ఎదో పని ద్వారానే సాధ్యం అని కాకుండా..అరగెంట్ మ్యాన్ కి ఉండాల్సిన చిన్న ఆటిట్యూడ్ ద్వారానే బయపెట్టాశాడు. సాయి పల్లవి కూడా తన భర్తను మార్చాలని తాపత్రయపడే ఇల్లాలుగా అద్భుతమైన నటననే కనబర్చింది. అలాగే చెంబన్ వినోద్, రేపిస్ట్ సైకిక్ పాత్రలో బాగా నటించాడు.

సాంకేతిక విభాగం :

ఇందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది..మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గురించే. సినిమాలో ఉన్న కంటెంట్ కి ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల ప్రేక్షకుడికి త్రిల్లర్ సినిమా చూస్తున్న ఫిల్ కలిగించడంలో వర్క్ అవుట్ అయింది. అలాగే దుల్కర్ కి చిరాకు, కోపం వచ్చినప్పుడు అతని ఆలోచనలను చెప్పడంలో గోపి సుందర్ సంగీతం చాలా హెల్ప్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా థ్రిల్లర్ ఫీలింగ్ ని కలిగించడంలో సఫలం అయింది. ఫ్రేమ్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఎడిటర్ వివేక్ హర్షన్ పనితనం కూడా చాల బాగుంది. ఎక్కడా బోర్ అనే ఫీల్ కలిగించలేదు.

చివరగా :

హే పిల్లగాడా, ఆనందంగా జీవించే భార్యభర్తల మధ్యల తలెత్తే చిన్న చిన్న గొడవల మూలానా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో, థ్రిల్లర్ ఎలెమెంట్స్ ను జోడించి చెప్పిన అద్భుతమైన చిత్రం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=mTb3Q0SL1Es]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here