అర్జున్ రెడ్డి సినిమాపై డైరెక్టర్ సందీప్ వంగా చెప్పిన షాకింగ్ నిజాలు

Arjun Reddy Telugu Movie Latest News, Director Sandeep Vanga Latest News, Director Sandeep Vanga Shocking Comments On Arjun Reddy Movie, Latest Telugu Cinema Updates, Sandeep Reddy Vanga About Arjun Reddy Movie, Telugu Film News 2017, Telugu Filmnagar, Telugu Movies News, అర్జున్ రెడ్డి సినిమాపై డైరెక్టర్ సందీప్ వంగా చెప్పిన షాకింగ్ నిజాలు

విజయ్ దేవరకొండ తాజా చిత్రం అర్జున్ రెడ్డిపై అభిమానుల్లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరగడానికి చాల సహాయపడ్డాయి. ఇందులో హీరో విజయ్ దేవరకొండ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నారు. ఈ అర్జున్ రెడ్డి సినిమా ప్రయాణం గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూసేద్దామా !!

సందీప్ రెడ్డి మాట్లాడుతూ” ఈ అర్జున్ రెడ్డి ప్రయాణం చాలా గమ్మత్తుగా జరిగింది. డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు మొదట స్టోరీ లైన్ ను హీరో శర్వానంద్ కు రాసుకున్నారు. తరువాత ఆ లైన్ తోనే ఫుల్ స్క్రిప్ట్ ను నేను రాసుకుని..శర్వానంద్, స్వప్న దత్ కు వినిపించా ! కానీ అక్కడ కుదర్లేదు. ఇక స్క్రీనింగ్ టెస్ట్స్ లో విజయ్, షాలిని ఇస్తున్న అవుట్ అవుట్ చూసి…ఈ సినిమాకి వెళ్ళే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యా. తరువాత ఈ స్క్రిప్ట్ ని చాలా మంది ప్రొడ్యూసర్స్ కి వినిపించా..ఎవరు నిర్మించడానికి ముందుకు రాలేదు. చివరకి మా అన్నయ్య ప్రణయ్ వంగానే నిర్మిస్తానని చెప్పడంతో ఇవాళ ఈ సినిమా మీ ముందు ఉంది” అని చెప్పారు.

ఇకపోతే ఈ అర్జున్ రెడ్డి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగష్టు 25న విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చగా, రాజ్ తోట సినెమాటోగ్రపీని అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=E9zkT0YAv1w]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here