రీమేక్స్ కు నో చెప్పిన స్టార్ హీరో

Star Hero Says No To Remakes,రీమేక్స్ కు నో చెప్పిన స్టార్ హీరో,Telugu Filmnagar,Telugu Movies News,Telugu Film News 2017,Latest Telugu Cinema Updates,Dhanush Says No To Remakes,Actor Dhanush Latest News,Hero Dhanush Upcoming Films,Dhanush Next Projects

ఇండియన్ సినిమాలో ప్రముఖ నటుల జాబితాలో తమిళ నటుడు ధనుష్ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈయన గతంలో కొన్ని రీమేక్స్ తీసి బాగానే విజయాలు పొందాడు. మన రామ్, శ్రీను వైట్లల రెడీ సినిమాని ఉత్తమ పుత్తిరన్ పేరుతో చేశాడు. కానీ తాజాగా ఇక నుంచి రీమేక్స్ జోలికి అసలు పొనని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఇందుకు గల కారణాలేంటో తెలుసుకుందామా !!

ధనుష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఎక్కడో ఓ న్యూస్ చూశాను. హిందీలో వచ్చిన బర్ఫీ సినిమాను రీమేక్ చేయబోతున్నానని, ఆల్రెడీ ఆ సినిమా రీమేక్ హక్కులు కూడా కొనేశాని అందులో రాశారు. ఈ విషయం తెలిసిన బర్ఫీ సినిమా బృందం నాకు అభినందనలు కూడా తెలిపారు. నేను మరి వాళ్ళకి ఇదంతా తప్పుడు వార్త. అందులో నిజం లేదని చెప్పాను. ఉత్తమ పుత్తిరన్ తరువాత రీమేక్స్ చేయకూడదని నిర్ణయించుకున్నా..ఒరిజినల్ కథలే నాలో నటుడికి మంచి ఆసక్తిని కలిగిస్తాయని” తెలిపారు.

ఇక ధనుష్ నటించిన తాజా చిత్రం విఐపి 2 సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రఘువరన్ B tech కు సీక్వెల్ గా ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Oa7caVgMtLw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here