మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో రావాల్సింది – AR మురుగదాస్

మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో రావాల్సింది AR మురుగదాస్,Telugu Filmnagar,Telugu Movies News,Telugu Film News 2017,Latest Telugu Cinema Updates,AR Murugadoss About Mahesh Babu and Spyder Movie,Director AR Murugadoss Latest News,Spyder Movie Updates,Superstar Mahesh Babu Spyder Telugu Movie Latest News

మహేష్ బాబు నటించిన స్పై థ్రిల్లర్ స్పైడర్ సినిమా కోసం తెలుగు అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని, ఒక పాటను చిత్రీకరించే పనిలో యూనిట్ మొత్తం నిమగ్నమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లో దర్శకుడు AR మురుగదాస్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తమిళంలో లైకా ప్రొడక్షన్ హౌస్ వారు కొనేసి భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. మరి దీని వెనుక మహేష్ బాబు స్ట్రాటజీ ఉందని అంతా అనుకున్నారు. కానీ , తాజాగా మురుగదాస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూసేద్దామా !!

మురుగదాస్ మాట్లాడుతూ “నేను 10 ఏళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాలనుకున్నాను. కానీ నాకున్న కమిట్మెంట్స్ వలన అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. సో ఇంతలో నా సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈసారి తెలుగు, తమిళ ద్విభాషా సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నా. రెండు భాషలను అనర్గళంగా మాట్లాడే మహేష్ బాబు మాత్రమే ఈ ప్రాజెక్టు సరైన న్యాయం చేయగలడని కలిశాను. ఆయన కూడా ఒకే చెప్పడంతో స్పైడర్ వచ్చింది” అని తెలిపారు.

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ఆడియోను రిలీజ్ చేసుకుని, దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=zSIOCJXRdBk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here