అభిమాని చెంప చెళ్లుమనిపించా – రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్, తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటిస్తూ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోంది. తన సినిమాల ప్రమోషన్స్ లో గాని, తోటి నటీనటులతో ఆరోగ్యకరమైన స్నేహబంధానాలను పెంచుకుని లౌక్యం గా ఉండే హీరోయిన్ అని పేరు సంపాదించింది. తన తాజా సినిమా జయ జానకి నాయక సినిమా ఆగష్టు 11న విడుదల కానుండడంతో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపారు. అవేంటో చూసేద్దామా !!

“నా జీవితంలో ఇప్పటివరకు ఇద్దరి వ్యక్తులపై చేయి చేసుకున్నానని తెలిపారు. ఒకర్ని కాలేజీ రోజుల్లోనని…మరొకరిని తాజాగానే హైదరాబద్ లోని ఫోరమ్ మాల్లో కొట్టానని తెలిపారు. ఎందుకు కొట్టారు అని అడగ్గా…కొన్ని రోజుల క్రితం నేను మా అన్నయ్య కలిసి సినిమా చూడటానికి వెళ్ళమని…అక్కడ ఒక వ్యక్తి నన్ను ఫాలో చేస్తూ నా వెనకాలే వస్తున్నాడు. సడెన్ గా వెనక్కి తిరిగి చూడగా నా మొహానికి దగ్గర వచ్చాడు. అప్పుడు నాకు పట్టరాని కోపంతో అతని చెంప చెళ్లుమనిపించా” అని తెలిపారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ “నా రెమ్యూనరేషన్ ని జయ జానకి, స్పైడర్ సినిమాలకు పెంచేలేదు” అని తెలిపారు. ఈ రెండు సినిమాలు గనుక సూపర్ హిట్ సాధిస్తే..ఈమె దశ తిరుగుతుందని ట్రేడ్ పండితులు చెప్పుకొంటున్నారు. ఇవే కాకుండా సూర్య సరసన సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాబోతున్న తమిళ సినిమాలో హీరోయిన్ గా ఈ ముద్దు గుమ్మా ఎంపికైంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=u9AvJVIsPfA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here