NTR, MGR లను స్ఫూర్తిగా తీసుకుని నేనే రాజు నేనే మంత్రి పుట్టింది – రానా

2017 Telugu Movies News, Latest Telugu Film News, Nene Raju Nene Mantri Movie Updates, NTR MGR లను స్ఫూర్తిగా తీసుకుని నేనే రాజు నేనే మంత్రి పుట్టింది రానా, Rana Comments On Nenu Raju Nene Mantri Movie Story, Rana Next movie, Rana Upcoming Film, Telugu Cinema Updates, Telugu Filmnagar, నేను రాజు నేనే మంత్రి స్టోరీకి నాన్న గారు కూడా హెల్ప్ చేశారు రానా

రానా, బాహుబలి సినిమాతో ఎనలేని ఖ్యాతిని సంపాదించి, ఘాజీ చిత్రంతో దేశమంతటా జేజేలు కొట్టించుకున్నాడు. తన తదుపరి చిత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుదలకు సిద్దమవ్వడంతో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాలను, స్టోరీని, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చాలా ఆసక్తికర అంశాలను తెలిపారు. ఆ విషయాలేంటో చూసేద్దామా !!

కథ గురించి మాట్లాడుతూ “ట్రైలర్ లోనే మొత్తం చెప్పేశాం. ఓ చిన్న పల్లెటూర్లో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ, రైతులకి అప్పులిస్తూ…తన మరదలు, మామతో మాములు జీవితం గడిపే ఓ సాధారణ వ్యక్తి జోగేంద్ర. ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా…సిన్సియర్ గా ఎదుగుదామనుకుంటే కొందరు తొక్కేస్తుంటారు. ఇక తాళలేక చివరికి అతనే రివర్స్ అయ్యి…పవర్, డబ్బు, క్రైమ్ ఉన్న సరికొత్త ప్రపంచంలో వెళ్తాడు. అక్కడ జోగేంద్ర ఎలా ఎదిగాడు…ఎలా అపజయాలు చూశాడు లాంటి ఆసక్తికర అంశాలను ప్రస్తావించాం. అలాగే ఈ స్టోరీ ఏ రాజకీయ నాయకుడిని అనుసరించి రాసుకున్నది కాదు, సినిమా చూశాక జోగేంద్ర లాంటి క్యారెక్టర్ మన మధ్యలోనే ఉందని ఫీల్ అవుతామని చెప్పారు. కాజల్ క్యారెక్టర్ రాధా గురించి చెప్తే… జోగేంద్రకు రాధా అంటే చాలా ఇష్టం అందుకే పెళ్ళయాక తన పేరు ముందు రాధను జోడించి…రధజోగేంద్ర గా మారుతాడని తెలిపారు.

లీడర్ సినిమాలో అర్జున్ కి ఈ జోగేంద్రకు పోలికల గురించి మాట్లాడుతూ “లీడర్ లో సమాజాన్ని మార్చడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తాడు. కానీ ఇందులో తనను కష్టపెట్టిన వాళ్ళ అంతుచూడ్డానికి రాజకీయాల్లోకి వస్తాడు. కొన్ని సన్నివేశాల్లో చెడ్డవాడిగాను కనిపిస్తాడని తెలిపారు. పంచె కట్టు గురించి కూడా మాట్లాడుతూ…సాధారణంగా ఈ కథ నెల్లూరు, తమిళనాడు బార్డర్స్ లో జరుగుతుంది. కాబట్టి ఆ సహజత్వం కోసం ఆలా వాడం అని తెలిపారు. ఇంకా నిర్మాత కూడా స్వయానా నాన్న సురేష్ బాబు గురించి కూడా చెప్తూ…స్క్రిప్ట్ లో ఎక్కడైనా లోపాలుంటే తన వంతు సలహాలిచ్చే వారని…వాటిని డైరెక్టర్ తేజ గారు తీసుకుని అమలు చేశారని తెలిపారు. ఈ కథ నాన్న గారికి నాకు బాగా నచ్చిన సినిమా అని….తేజ గారు చాల బాగా తీశారని, కాకపోతే ఈ సినిమా ఎప్పుడో రావాల్సిందని…ఘాజీ, బాహుబలి ఉండటం వలన ఆలస్యం అయిందని, కాకపోతే స్క్రిప్ట్ కు టైం చాలా దొరికిందని సెలవిచ్చారు.

ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో రాడాజోగేంద్ర అటు తెరపైన..ఇటు బాక్స్ వద్ద అశేషమైన మెజారిటీ కలెక్షన్స్ తో దూసుకెళ్లాలని తెలుగు ఫిలింనగర్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=knKdeRpciz8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here