దర్శకుడు సినిమా రివ్యూ

దర్శకుడు సినిమా రివ్యూ,Darsakudu Movie Review,Darsakudu Telugu Movie Review,Darsakudu Review,Telugu Filmnagar,2017 Latest Telugu Movie Reviews,Telugu Cinema Reviews Ratings,Tollywood Movies Reviews,Darsakudu Movie Live Updates,Darsakudu Movie Story,Darsakudu Movie Public Talk,Darsakudu Telugu Movie Public Response,Darsakudu Telugu Movie Review Rating

దర్శకుడు సినిమా రివ్యూ :

సినిమా : దర్శకుడు
నటీనటులు : అశోక్, ఈషా రెబ్బా
దర్శకుడు : జక్కా హరిప్రసాద్
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : సుకుమార్
బ్యానర్ : సుకుమార్ రైటింగ్స్

కథ : మహేష్ అనే యువకుడికి చిన్నప్పటి నుండి సినిమాపై ఎనలేని పిచ్చి, మక్కువతో హైదరాబద్ వస్తాడు. మొదట లైట్ బాయ్ గా చేరి, ఆ తరువాత మంచి స్టోరీని రాసుకుని ప్రొడ్యూసర్ కి వినిపిస్తాడు. ఆ కథలో లవ్ స్టోరీ కూడా ఓ భాగమై ఉంటుంది. కానీ, మహేష్ ఎప్పుడు ఎవర్ని లవ్ చేయకపోవడం వలన లవ్ సీన్స్ ను సరిగ్గా తెరకెక్కించడం రాదు. కానీ ఎవరినైనా మాయచేసి…ఇతనికి కావాల్సిన పాయింట్స్ ను రాబట్టడంలో మహేష్ దిట్ట. ఇదే సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నమ్రత (ఈషా) తో ప్రేమించినట్టు నటిస్తూ…అక్కడ జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ను తన సినిమాలో వాడేసుకుంటూ ఉంటాడు. అంటే తన డైరెక్షన్ కెరియర్ ను ఇటు లవ్ ను రెండిటిని ఎలా బ్యాలన్స్ చేశాడు ? అసలు చివరికి అతను అనుకున్న సినిమా సరిగా తీశాడా అని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ముందుకు మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా కథ. కథ పేపర్ మీద రాసుకున్నప్పుడు చాల అందంగా అన్ని ఎమోషన్స్ తో బాగానే ఉంది. ఇలాంటి ప్రయోగాత్మల సినిమాలకి బలమైన పాత్రలు ఉంటె ఆడియన్సు ఈజీగా కనెక్ట్ అవ్వడనికి సహాయపడుతుంది. ఈ విషయంలో డైరెక్టర్ జక్కా హరిప్రసాద్ కాస్తా జాగ్రత్తలు తీసుకుని ఉంటె బాగుండేది. హీరో, తన కెరియర్ ను లవ్ ను బ్యాలన్స్ చేస్తూ సినిమా తీసే పద్దతిని డైరెక్టర్ చాలా నిజాయితీగా చెప్పి..సంతృప్తి పరిచాడు. ఇంకా మహేష్, నమ్రతను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ….ప్రేమికుల మధ్య చోటు చేసుకునే సన్నివేశాలను తన సినిమాలో వాడుకోవడం బాగున్నా..చివరికి కథ మొత్తం ఏటో వెళ్ళిపోతుంది. సినిమా క్లైమాక్స్ వచ్చే సరికి డైరెక్టర్ మహేష్, ‘నమ్రతతో తాను సినిమా కోసం లవ్ చేయలేదని..నిజంగానే లవ్ చేశానని” రియలైజ్ అవ్వడంతో ఇది సినిమా పిచ్చా జోనర్ సినిమా లేదా లవ్ స్టోరీనా అనే చిన్న ఆందోళనలోకి ప్రేక్షకుడు వెళ్తాడు. ట్రైలర్ లో చెప్పినట్టు డైరెక్షన్ అంటే 80% మేనేజ్మెంట్, 20% డైరెక్షన్” కి జస్టిఫికేషన్ మాత్రం దర్శకుడు ఇచ్చాడు.

నటీనటుల పనితీరు : హీరో అశోక్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ మంచి పెర్ఫార్మన్స్ ను ఇచ్చాడు. తన హైట్ కి, లుక్స్ ఈ పాత్రను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా…డీసెంట్ గా ఉన్నాయి. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గాను, లవర్ గా రెండు రకాల విభిన్న పాత్రలను సూపర్బ్ పెర్ఫార్మన్స్ తో చేసింది. హీరో, హీరోయిన్ ఫాథర్స్ గా చేసిన ఆర్టిస్ట్స్ కూడా బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో సుదర్శన్ తన పరిధిలో బాగానే మెప్పించాడు.

సాంకేతిక విభాగం : మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన సంగీతం సినిమాను విజయంవైపు నడిపించడంలో చాలానే సహాయపడింది. ఇక సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు పనితనం కూడా చాలా చాలా మెచ్చుకోదగ్గగా ఉంది . ఒక చిన్న సినిమాను తన అద్భుతమైన పనితనంతో రిచ్ లుక్ ను ఇచ్చాడు. ఫైనల్ గా డైరెక్టర్ జక్కా హరిప్రసాద్ విషయానికొస్తే తాను రాసుకున్న కథలో కేవలం “ఒక సినిమా పిచ్చి గల డైరెక్టర్..తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను తెరపై ఎలా చూపించాడు..అందుకు తాను ఏం చేశాడు. అనేది మెయిన్ ప్లాట్ గా పెట్టుకుని తీశాడు. అటు స్క్రీన్ ప్లే గాని, డైలాగ్స్ కానీ, సినీపరిశ్రమలో కొత్త డైరెక్టర్స్ ఎలా కష్టపడుతుంటారు ? కొత్త దర్శకులకి ఏవిధమైన మెసేజులు లేకుండా..రెగ్యులర్ సినిమా స్థాయిలో తెరకెక్కించాడు”.

ప్లస్ పాయింట్స్ :
– డైరెక్షన్
– నటినటుల పెరఫార్మన్స్
– సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
– సెకండ్ హాఫ్
– స్టోరీ

చివరగా :

ఈ దర్శకుడు సినిమా రెగ్యులర్ ఆడియన్సు కి కాకూండా కేవలం సినిమా ప్రేమికులకు మాత్రమే నచ్చేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here