లై ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు రిలీజ్ డేట్ ఎప్పుడంటే !!

నితిన్, హనురాఘవాపుడి దర్శకత్వంలో నటించిన సినిమా “లై” LIE అంటే లవ్..ఇంటెన్స్..ఎనిమిటి. ఈ సినిమా టైటిల్ నే డిఫెరెంట్ గా పెట్టుకొని అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించి.. సక్సెస్ లో మొదటి మెట్టు ఎక్కేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో నితిన్ అల్ట్రా స్టైలిష్ గా బీర్డ్ లుక్ తో కనిపిస్తూ సినిమాపై మంచి అంచనాలనే పెంచేశాడు. ఇక సినిమా మొదలుపెట్టినప్పుడే ఆగష్టు 11న రిలీజ్ డేట్ అని ప్రకటించుకున్నాడు. కానీ అప్పటికి రాకపోవచ్చని అందరు అనుకున్నారు. కానీ అవన్నీ పటాపంచాలు చేస్తూ ఆగష్టు 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతాం, ఆగస్టు 11న సినిమా తప్పకుండా రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఖరారు చేసింది.

ఇక మణిశర్మ అందించిన బాణీలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయగా…అన్నిటికి డిఫెరెంట్ సాంగ్స్ ని మంచి రివ్యూని అందుకున్నాయి. గత నెలలో వచ్చిన టీజర్ అయితే మాములు సునామి సృష్టించలేదు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో అర్జున్  చెప్పిన “కోట్ల మంది సరిపోలేదట..పంచ పాండవులు సాధించలేదట..చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట..అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట.. అశ్వధామ హతహ.. కుంజరహ..” అనే డైలాగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్ర్రలో నటిస్తున్న అంశం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించవచ్చని సినీప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండడం కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వడంలో సహాయపడింది. సో ఇంకా లెట్స్ వెయిట్ అండ్ సి ఆగష్టు 11న ఏమవుతుందో !!

ఈ యాక్షన్ సినిమాలో  హీరోయిన్ గా మేఘా ఆకాష్ నటించగా, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here