డిసెంబర్ లో టాలీవుడ్ “ఢీ”

డిసెంబర్ లో టాలీవుడ్ ఢీ,2017 Telugu Movies News,Latest Telugu Film News,Telugu Cinema Updates,Telugu Filmnagar,Tollywood Big Fight in December,2017 Tollywood Fight,Tollywood Big Fight,Rangasthalam,MCA Movie,Akhil Next Movie

ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో టాలీవుడ్ ఢీ తప్పేలా లేదు. ఈ సినిమా క్లాషెస్ మన ఇండస్ట్రీకి కొత్తేమి కాదు కదా !. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలు ఎన్ని సార్లు పోటీపడలేదు. ఇప్పడు అదే పరిస్థితి నెలకొనేలా కనిపిస్తోంది. కానీ వీరి మధ్యకాదండోయ్…! రామ్ చరణ్, నాని, అఖిల్ అక్కినేనిల మధ్య ఈ ఢీ ఉండబోతుందని సమాచారం. వీరు ముగ్గురు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చకా చకా షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ లో థియేటర్ల వద్ద సందడి చేయాలనేది ఇనీషియల్ ప్లాన్. మరి దీనిపై ఫుల్ డిటైల్స్ చుసేద్దమా  !!

1. రంగస్థలం 

రామ్ చరణ్, తన పాత పంథాను వదిలేసి, ధృవ సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు చేరువై మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను సుకుమార్ తో కంటిన్యూ చేస్తూ రంగస్థలం సినిమాని వైవిధ్యంగా చేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ చూస్తే రామ్ చరణ ఓ పల్లెటూరి రైతుగా చాల న్యాచురల్ గా పంచె కట్టుతో ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సుకుమార్ సంగతి తెలిసిందే కదా..వైవిధ్యమైన సినిమాలు, హీరోలకు డిఫెరెంట్ మేకోవర్ ఇలా తనదైన మార్క్ తో సినిమా తీస్తాడు కాబట్టి…ఈ ప్రాజెక్టు పై పాజిటివ్ వైబ్రేషన్స్ గట్టిగా ఉన్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. టాలీవుడ్ లో అతి కొద్ది కాలంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ లవ్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గత సంవత్సరం ధృవ సినిమా డిసెంబర్ నెలలో వచ్చి హిట్ కొట్టింది కాబట్టి, ఇప్పుడు అదే ఫార్ములాను సెంటిమెంట్ గా రిపీట్ చేయాలనీ రామ్ చరణ్ భావిస్తున్నాడని సమాచారం.

2. MCA 

తెలుగులో స్టార్ హీరోలు సైతం లేని ఫామ్ లో న్యాచురల్ స్టార్ నాని ఉన్నాడు. ఈ సంవత్సరం ఆరంభంలో నేను లోకల్ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదుచేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన నిన్ను కోరి. డిఫెరెంట్ లవ్ స్టోరీతో, పర్ఫెక్ట్ ఎమోషన్స్ తో ఓ మంచి సినిమాగా నిన్ను కోరి పేరు తెచ్చుకుంది. నానికి ప్రధాన బలం ఏంటబ్బా అంటే స్క్రిప్ట్ సెలక్షన్..వరుసగా ఏడు సినిమాలు హిట్ అవ్వాలంటే మాములు విషయం కాదు. నిన్ను కోరి సినిమాలో నాని తన నటనతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి, క్రిటిక్స్ చేత భేష్ అనిపించుకున్నాడు. తన తరువాతి సినిమాను MCA మిడ్డిల్ క్లాస్ అబ్బాయి ని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మొదలెట్టి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఇందులో ఫిదా గర్ల్ సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు తీసురావాలని చిత్రనిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట. సో ఈ సినిమా పరంగా నాని, సాయి పల్లవి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉండడంతో హిట్టు బొమ్మకి చాలా దగ్గర ఉంది.

3.అఖిల్ & విక్రమ్ కుమార్ ల సినిమా 

అఖిల్ అక్కినేని, ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మొదటి సినిమా ప్లాప్ కారణంగా…రెండో సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే దృఢనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఇక స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయంలో విక్రమ్ కుమార్ తోపు కాబట్టి సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది. గతంలో అక్కినేని ఫ్యామిలీతో మనం చూశాం కదా !! అసలు స్టోరీ కానీ, టేకింగ్, స్క్రీన్ ప్లే టాప్ లెవెల్ లో ఉంటాయి. తన లాస్ట్ సినిమా సూర్య 24 కూడా సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందించి మంచి మార్కులే పొందాడు. మ్యూజిక్ అనూప్ రూబెన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున గారు నిర్మిస్తున్నారు. సో ఈ ప్రాజెక్టు పై ఎటు చూసినా హిట్టు బొమ్మ కనిపిస్తోంది. ఈ సినిమా కూడా డిసెంబర్ 22న విడుదల కావడానికి మెల్లగా రెడీ అవుతోంది.

మాములుగా డిసెంబర్ నెలలో క్రిస్మస్ హాలిడేస్ మరియు న్యూ ఇయర్ హాలిడేస్ కాస్త ఎక్కువ కాబట్టి ఈ సినిమాలన్ని ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్దకు రానున్నాయి. మరి వీటిలో ఏ సినిమా సత్తా చూపిస్తుందో..కానీ, ఇలా మంచి సినిమాలన్నీ ఒకదాని తరువాత ఒకటి థియేటర్స్ లోకి వస్తుంటే సినీప్రేమికులకు ఎంత బాగుంటుందో. సో ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ తెలుగు ఫిలింనగర్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here