మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్

మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్,Latest Telugu Film News,Telugu Cinema Updates,Telugu Filmnagar,2017 Telugu Movies News,Mahesh Babu New Look,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Latest News,Spyder Movie Updates,bharath ane nenu movie Updates,Mahesh Spyder New Look

మహేష్ బాబు ప్రస్తుతం AR మురుగదాస్ దర్శకత్వంలో “స్పైడర్” టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ ను ఓ నాలుగైదు నెలల క్రిందట వదిలేసి మహేష్ అభిమానుల కోపాన్ని, ఆత్రాన్నీ కాస్త తగ్గించారు. ఓ నెల క్రితం గ్లిమ్ప్స్ అఫ్ స్పైడర్ టీజర్ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పుడిక మహేష్ బాబు పుట్టిన రోజు దగ్గర పడుతుండడంతో ఆగష్టు 9న స్పైడర్ టీజర్ ను విడుదల చేస్తామని నిన్న సాయంత్రం ఓ రెండు వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేసి చిత్రబృందం తెలిపింది.

మరో వైపు భరత్ అనే నేను టీం కూడా సూపర్ స్టార్ కు బర్త్ డే గిఫ్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు కొరటాల శివ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపిస్తారని గట్టిగా వినిపిస్తున్న వార్త. కాగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సో ఈ రెండోది కూడా నిజమైతే మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధామాకే .

ఇక స్పైడర్ సినిమాలో బాలన్స్ గల ఓ పాటను రొమేనియాలో ఆగస్టు 2 నుంచి ఆగష్టు 8 వరకు చిత్రీకరిస్తారు. ఇక ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. హరీష్ జయరాజ్ సంగీతం సమకూర్చగా, రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. SJ సూర్య, భరత్ లు విలన్ పాత్రలలో నటించారు. ఈ స్పైథ్రిల్లర్ ను NV ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=grtNcljpFtY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here