జనగణమన ఖచ్చితంగా తీస్తా – పూరీ జగన్నాధ్

పూరీ జగన్నాధ్, ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన గొప్ప డైరెక్టర్. కోట్లు రెమ్యూనరేషన్, సినిమా తీస్తే హిట్టు, డైలాగ్ రాస్తే చెంప చెళ్లుమనాల్సిందే. స్వతహాగా డబ్బు మీద మక్కువ లేని పూరీకి ఓ మిత్రుడు నమ్మక ద్రోహం చేయడంతో ఉన్న డబ్బంతా పోగొట్టుకుని రోడ్డున్న పడ్డాడు. అయినా ఏమాత్రం బెదరకుండా ఆ బాధను, కసిని తన కలంలో నింపి “బిజినెస్ మెన్” సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసి, సెన్సేషన్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో “ఎవ్వడి మాట వినకు…మనిషి మాట అసలు వినకు” అనే డైలాగ్ చూస్తే తన నిజజీవితం నుండి ప్రేరణ పొంది రాసినట్టు ఉంటుంది.

పూరీ జగన్నాధ్, డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు పేరు బయటికి రావడంతో మీడియా వారు పూరి గారి మీద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొన్ననే పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. గత వారంగా జరిగిన పరిణామాలన్నీ పూరి జగన్ ను బాగా బాధపెట్టాయి. అదే విషయాన్ని వీడియో ద్వారా ఎంతో బాధాతత్ప హృదయంతో చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ బాధను సినిమా ద్వారా చెప్పాలనుకున్నట్టు సమాచారం. సంవత్సరం క్రిందట మహేష్ బాబుతో ప్రకటించిన జనగణమన సినిమాను ఎప్పటికైనా తీసి తీరుతానని…ప్రస్తుత పరిణామాలు వలన ఆ కసి ఇంకా పెరిగిందని బల్లగుద్ది చెప్తున్నాడు మన పూరీ.

జనగణమన నా లైఫ్ యాంబిషన్. ఆ సినిమా చేయాలన్న పట్టుదల ఇంకా పెరిగింది. దేశంలో ఉన్న వంద ఇష్యూలతో ఈ స్క్రిప్టు రాస్తున్నా. ‘ఐ లవ్‌ ఇండియా… ఐ హేట్‌ ఇండియన్స్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఇలా ఎందుకు పెట్టాననేది సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. దేశం మీద అభిమానం.. ప్రేమ ఉండబట్టే ఈ కథ రాస్తున్నా. నా మీద ఆరోపణలు చేస్తున్న వారందరు ఈ స్క్రిప్ట్ రాయలేదు. ఈ సినిమాను నేను తప్పకుండా తీస్తా…ప్రేక్షకులు చూస్తారు” అని పూరీ జగన్నాధ్ తన తాజా ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
 
[youtube_video videoid=Xct31xZrk58]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here