ఎన్టీఆర్ ఆ రీమేక్ చేయట్లేదట !!

జూనియర్ ఎన్టీఆర్,2017 Telugu Movies News, Jr NTR Latest News, Jr Ntr Pro Latest News, Jr Ntr Upcoming Movie, Latest Telugu Film News, Ntr Next Film, Ntr Not Doing Thar Remake, Telugu Cinema Updates, Telugu Filmnagar, ఎన్టీఆర్ ఆ రీమేక్ చేయట్లేదట

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ షూటింగ్ లో బిజీ బిజిగా గడుపుతున్నాడు. మరో వైపు బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ రెండు పూర్తి కావాలంటే మరో రెండు మూడు నెలలు సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఓ రెండురోజులుగా ఎన్టీఆర్ ఓ రీమేక్ సినిమాను చేస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేనా ఈ ప్రాజెక్టు ఎలా పట్టాలెక్కనుందో కూడా ఓ బ్లూ ప్రింట్ తీసి వదిలారు. అందులో ఏముందటే…ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల అవుతుంది. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను ఆల్రెడీ కమిట్ అయ్యాడు కదా ! సో ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ రీమేక్ ఉంటుందని నా నా హంగామా చేశారు.

ఒకసారి ఆ రీమేక్ సినిమా వివరాలు చూసుకుంటే..ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడైన కన్నడ పునీత్ రాజ్ కుమార్ తాజాగానే రాజకుమారా అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది కథాపరంగా సామజిక పరిస్థితులను ప్రశ్నించేలా ఉంటుంది. ఈ కథ ఎన్టీఆర్ బాగా నచ్చడంతో…ఆ సినిమా హక్కులు కూడా ఆల్రెడీ దక్కించుకున్నారని వార్తలొచ్చాయి. దీనిని సీరియస్ గా పరిగణించిన ఎన్టీఆర్ PRO ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.

ఇక జై లవకుశ విషయానికొస్తే ప్రస్తుతం పూణే లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమైవుంది. సినిమాలోని లవకుమార్ క్యారక్టర్ టీజర్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 21న దసరా కానుకగా విడుదల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=8asS0V78_go]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here