బాలకృష్ణ 102 వ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్స్

బాలకృష్ణ తన 102 వ సినిమాని KS రవి కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఆగష్టు 3వ తేదీ నుండి రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందంలు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ఈ సంధర్బంగా నిర్మాత C కళ్యాణ్ మాట్లాడుతూ “సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గారి 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఎం.రత్నం గారు అద్భుతమైన కథను అందించారు. అనుకోసమే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా చేస్తామని, రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్స్ లో 30 రోజుల పాటు నిరవధిక షూటింగ్ జరుపుతామని తెలిపారు. అంతేకాకుండా సినిమాలోని కీలక సన్నివేశాలని ఈ షెడ్యూల్లోనే డైరెక్టర్ గారు చిత్రీకరిస్తారు అని తెలిపారు.

ఈ సినిమాకి గౌతమిపుత్ర శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం సమకూర్చనుండగా, సినిమాటోగ్రఫీని రాంప్రసాద్ అందించనున్నారు. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తారు. దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Xct31xZrk58]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here