అప్పట్లో చిరంజీవి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి.. తీసేశారు ! : న‌టి ఆమ‌ని

2017 Telugu Movies News, Aamani Latest News, Aamani Movies, Actress Aamani, Latest Telugu Film News, Mega Star Chiranjeevi 151st Film, Telugu Cinema Updates, Telugu Filmnagar, అప్పట్లో చిరంజీవి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారు న‌టి ఆమ‌ని

సినిమా ఇండస్ట్రీ అన్నాక వచ్చిన అవకాశాలు వెళ్లిపోవడం, రావడం సహజమే. అలనాటి నటి ఆమనికి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా వారితో చెప్పుకున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం నన్ను వరించిందని, కొన్ని అనివార్యాల కారణాల వలన ఆ అవకాశం చేజారిపోయిందని తెలిపారు. అప్పట్లో దీనికి దారితీసిన పరిస్థితుల గురించి ఈ విధంగా మాట్లాడారు.

“పరుచూరి బ్రదర్స్ తో కలిసి అమెరికాను ఓ నెల రోజుల పాటు విహారయాత్రకు వెళ్లాల్సి వచ్చింది. దానికి నేను ఒప్పుకుని రెడీగా ఉన్నా. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి గారి సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఓ ఆఫర్ రావడంతో ఆ అమెరికా ప్లాన్ రద్దుచేసుకుని, సినిమాకు నా కాల్షీట్లు కూడా ఇచ్చేసి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూశా !, కానీ, సడెన్ గా నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారని తెలిసింది. ఇక అప్పుడు నా అమెరికా ప్లాన్ వెళ్లిపోయే…ఇటు మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటించే సినిమా కూడా వెళ్లిపోయే అనుకున్నా” అని తెలిపారు. ఇదేదో సీరియస్ గా చెప్పలేదండోయ్..! ఎంతో సరదాగా.. తన తాజా ఇంటర్వ్యూలో ఆమని గారి తెలిపారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే… మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆగష్టు 15న అఫీషియల్ గా లాంచ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=f7eZCs72eF8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here