రామ్ చరణ్ తో సినిమా తప్పకుండా ఉంటుంది – మణిరత్నం

2017 Telugu Movie News, Latest Telugu Cinema Updates, Mani Ratnam Latest Updates, Mega Power Star Ram Charan Mani Ratnam Latest News, Ram Charan Latest News, Ram Charan Mani Ratnam Combination Movie, Rangasthalam Movie, Telugu Filmnagar, రామ్ చరణ్ తో సినిమా తప్పకుండా ఉంటుంది మణిరత్నం
రామ్ చరణ్ తో సినిమా తప్పకుండా ఉంటుంది మణిరత్నం

రామ్ చరణ్, మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. మరి ప్రస్తుతం రామ చరణ్..సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజిబిజిగా గడుపుతున్నారు. ఒక్కసారి ఈ సినిమా షూటిగ్ కంప్లీట్ అవ్వగానే, ఈ మధ్యనే కొరటాల శివతో అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ ను రామ్ చరణ్ షురూ చేస్తాడు. మరి ఈ మణిరత్నం సినిమా ఎప్పుడొస్తుంది..అనుకుంటున్నారా ?

మరి ఇదే ప్రశ్నను మణిరత్నం గారిని తాజా ఇంటర్వ్యూలో అడగ్గా “రామ్ చరణ్ తో సినిమా ఇప్పట్లో కుదరకపోవచ్చు. కానీ, ఫ్యూచర్ లో మాత్రం పక్కాగా మా కాబినేషన్ లో ఓ సినిమా ఉంటుంది” అని ధీమాగా చెప్పారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు, నాగార్జున కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ సినిమా రానుందని అప్పట్లో మన సినీప్రేమికులు తెగ సంబరపడిపోయారు. మరి కనీసం ఈ సారైనా మణి గారు రామ్ చరణ్ తో తప్పకుండ సినిమా చేస్తే తెలుగు వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=RQxrdcI6NJo]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here