పటేల్ సర్ మూవీ రివ్యూ

Patel S.I.R Telugu Movie Review,Patel S.I.R Movie Review,Patel S.I.R Review,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates,Latest Telugu Movie Reviews,Patel S.I.R Review And Rating,Patel S.I.R Movie Story,Patel S.I.R Movie Live Updates,Jagapathi Babu Patel S.I.R Movie Public Talk,Actor Jagapathi Babu Patel S.I.R Public Response,పటేల్ సర్ మూవీ రివ్యూ
పటేల్ సర్ మూవీ రివ్యూ

పటేల్ సర్ మూవీ రివ్యూ :

సినిమా : పటేల్ సర్
నటీనటులు : జగపతి బాబు, పద్మ ప్రియా, తాన్యా హొప్
దర్శకత్వం : వాసు పరిమి
సంగీతం : డి.జే. వసంత్
బ్యానర్ : వారాహి చలనచిత్రం

కథ :

జగపతి ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఓ పాపతో కలిసి జీవనం సాగిస్తూ, ఆ పాప బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు కబీర్ సింగ్ గ్యాంగ్ లోని ఒక్కొక్కరిని వరుసగా చంపుతుంటాడు. ఇంకో వైపు పాపా కంటి చూపు కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటాడు. ఆ పాపాకు కంటి చూపు వచ్చేసరికి ఆ గ్యాంగ్ సభ్యులను చంపాలని టార్గెట్ పెట్టుకుని ఉంటాడు. ఈ వరుస హత్యలను ఛేదించాడనికి పోలీస్ ఆఫీసర్ పాత్రలో తాన్యా హోప్ రంగంలోకి దిగుతుంది. మరి ఆ గ్యాంగ్ ని జగపతి బాబు ఎందుకు టార్గెట్ చేశాడు. ఆ పాపకు, జగపతి బాబుకు సంబంధం ఏంటి ?, మరి ఆ పోలీస్ ఆఫీసర్ జగపతి బాబుని పట్టుకుందా అని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ పటేల్ సర్ సినిమాకి వెన్నెముక అంటే జగపతి బాబు అనే చెప్పొచ్చు. అయన నటలో చూపించిన వేరియేషన్స్, వయసుకు తగ్గట్టు స్క్రిప్ట్ సెలక్షన్ ఆమోదయోగ్యమే. జగపతి బాబు అల్ట్రా పోష్ లుక్ కూడా ఆడియన్సు ని అబ్బురపరిచేలా ఉంది. ఆ చిన్న పాప యాక్టింగ్ కూడా ప్రేక్షుకుల చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంది. ఇక దర్శకుడు ఈ కథను కాస్త కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో చేసిన స్క్రీన్ ప్లే మేజిక్ బాగానే వర్క్ అవుట్ అయింది. అంతేకాకుండా ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా, సెకండ్ హాఫ్ పై కాస్త ఆతృతను పెంచేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పద్మ ప్రియా యాక్టింగ్, తాన్యా హోప్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ను బ్రిలియంట్ గా మలచడంలో దర్శకుడు వాసు పరిమి సఫలమయ్యారు. దీంతో పాటు సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ ప్రేక్షుకుడి చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆమోదయోగ్యాంగానే ఉంది.
ఇంకా ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఇలాంటి రివెంజ్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ దర్శకుడు వాసు పరిమి, జగపతి బాబును పవర్ ఫుల్ లుక్ లో చూపించి ఆడియన్సు కు ఆ ఫీల్ రాకుండా జాగ్రత్తగా సబ్జెక్టు ను డీల్ చేశాడు. ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ పై లుక్కేస్తే మన లాజిక్స్ కు చాలా దూరంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

వాసు పరిమి ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమి లేకపోయినా, దర్శకుడిగా తన ప్రతిభను చూపి దాదాపు సఫలమయ్యారు. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు కూడా అభినందించగ్గా రీతిలో ఉన్నాయి. DJ వసంత్ అందించిన సంగీతం కూడా కథలోని భావాన్ని సగటు ప్రేక్షుకుడికి చేర్చడంలో బాగా పనిచేసింది. శ్యామ్ కె నాయడు అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో సీన్స్ ని అందంగా తీర్చిదిద్దండంలో ముఖ్యపాత్రను పోషించింది.

ప్లస్ పాయింట్స్ :

జగపతి బాబు
సినిమాటోగ్రఫీ
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
సంగీతం

మైనస్ పాయింట్స్ :

స్టోరీ
లాజిక్స్ లేని కొన్ని సన్నివేశాలు

చివరగా :

ఈ పటేల్ సర్ చెప్పాలంటే జగపతి బాబు వన్ మెన్ షో. లాజిక్స్ ను వదిలేసి ఎమోషనల్ డ్రామాలను, రివెంజ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫస్ట్ ఛాయస్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=8swtUQlKSm0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here