ఈ నెలాఖరున “స్పైడర్” టీజర్

ఈ నెలాఖరున స్పైడర్ టీజర్,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates,Spyder Movie Updates,Spyder Movie Teaser Release Date,Spyder Telugu Movie teaser,Mahesh Babu Spyder Teaser

సూపర్ స్టార్ మహేష్ బాబు, AR మురుగదాస్ ల భారీ చిత్రం “స్పైడర్” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండు సాంగ్స్ షూటింగ్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా గత నెలలో గ్లిమ్ప్స్ ఆఫ్ స్పైడర్ గా ఓ చిన్నపాటి వీడియోను చిత్ర బృందం విడుదల చేసి,మహేష్ అభిమానులను కాస్త బుజ్జగించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను ఈ నెలాఖరున రిలీజ్ చేయాలనీ చిత్రబృందం భావిస్తోందని సమాచారం.

ఇక దర్శకుడు AR మురుగదాస్, టీజర్ కు సంబంధించిన పనులకు వేగవంతం చేశారని, అంతేకాకుండా సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా పక్కా ప్లాన్ తో తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా SJ సూర్య విలన్ గా నటించారు. హరీష్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం…సినిమాను తెలుగు, తమిళ్ వెర్షన్స్ లో రెండు సార్లు షూట్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=qeni-k0AgWU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here