వెండితెర మాంత్రికుడు అమ్రిష్ పూరి

“విలన్” అనే పదానికి సరైన అర్థాన్ని తన విలక్షణమైన నటనతో భారతీయ సినీరంగాన్ని ఏలిన మహానుబావుడు “అమ్రిష్ పూరి”. ఈ రోజు ఆయన 85వ పుట్టినరోజు సంధర్బంగా తెలుగు సినిమాల్లో మరువలేని అయన చెప్పిన ఫెమస్ డైలాగ్స్ పై ఓ లుక్ వేసేద్దామా ?

చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో ఖాద్రా పాత్రలో

“ఆలీ…కపాళి…పాతాళ్ కాళీ
సూటిగా చూడు దిక్కులు చూడకు
నా కళ్ళల్లోకే చూడు నా కళ్ళలోకే చూడు”

అంటూ హిప్నటైజ్ చేసే డైలాగ్ కేవలం అమ్రిష్ పూరి వాయిస్ మ్యడులేషన్ కి మాత్రమే సెట్ అయ్యేలా ఉంటుంది.

ఇంకా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో మహా దృష్ట్య పాత్రలో

“మహా దృష్ట్య పాళికా
కపాళికా ఆవాహయామి
దృష్ట గ్రహ పీడా నివారణమస్తు
సర్వారిస్టా నివారణమస్తు
మాదబీష్ట నివారణమస్తు
అష్టదిగ్బంధనమస్తు”

ఈ డైలాగ్ మనందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో “మహా దృష్ట్య పాళికా కపాళికా” అనే డైలాగ్ మోస్ట్ పవర్ ఫుల్ గా సినిమాకే హైలెట్ గా నిలిచి. అప్పట్లో ఈ డైలాగ్ వినగానే థియేటర్లలో అరుపులు కేకలతో రీసౌండ్ వచ్చేది.

అమ్రిష్ పూరి ఏ డైలాగ్ పలికిన ఓ వైవిధ్యంతోను, వాయిస్ లో ఓ గరుకు తనం, ఆ ఇంటెన్సిటీ మెండుగా ఉంటాయి. జగదేకవీరుడు అతిలోక సుందరిలో మాంత్రికుడుగా, చిరంజీవికి సైతం స్క్రీన్ మీద పోటీగా అంతటి ఎనర్జీ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారు. ఎంతలా అంటే.. అమ్రిష్ పూరి ఎంట్రీ కు ముందు, ఎంట్రీ తర్వాత అనేలా ఈ సినిమా ఉంటుంది.

తెలుగులో ఈయన సినీప్రస్థానం చూస్తే దాదాపు అన్ని మెజీషియన్ గాను, మాంత్రికుడిగానే ఆకట్టుకున్నారు. బాలకృష్ణ నటించిన “నిప్పు రవ్వ” సినిమాలో బలగం అనే పాత్రలో బొగ్గుగని యజమానిగా, అవినీతి వంతుడైన రాజకీయ నాయకుడిగాను తన విలక్షణ నటనతో సినిమా విజయంలో ముఖ్య భూమికను పోషించారు. “పగలు ప్రజారాజ్యానికి అధిపతిని, రాత్రి చీకటి రాజ్యానికి అధినేతని.” ఈ డైలాగ్ ని అమ్రిష్ పూరి వాయిస్ లో ఊహించుకోండి. మన Sr.ఎన్టీఆర్ సినిమా లో విలన్ ఏ రేంజ్ లో ఉండాలో, అంతకు మించి MP జ్ఞానేశ్వర్ రావు పాత్రలో అమ్రిష్ పూరి ఇమిడిపోయి, అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో తనదైన ముద్ర వేశారు.

బాలీవుడ్ నుండి ఎంతో డబ్బు ఖర్చుపెట్టి తెచ్చిన విలన్ మన అమ్రిష్ పూరి. అసలు విలన్ పాత్రలకు సరైన అర్థం చెప్పింది అమ్రిషి పూరి. అక్కడ అమ్రిష్ పూరి సినీప్రయాణం చూస్తే బాగా పాపులార్ అయిన డైలాగ్ మాత్రం అనిల్ కపూర్ హీరోగా మిస్టర్ సినిమాలోని “మొగాంబో కో కుష్ హువ’. “జా సిమ్రన్ జా. జీలే అ ప్ ని జిందగీ.” దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో ఈ డైలాగ్ ని ఎవరైనా, ఎప్పటికైనా మరిచిపోగలరా? షారుఖ్ ఖాన్, కాజోల్ జోడి కి ఎంత మంచి పేరు వచ్చిందో, కాజోల్ కఠినమైన తండ్రి పాత్రలో అమ్రిష్ పూరి కి అంతకు మించి పేరు వచ్చింది. అబితాబ్ బచ్చన్ “షహెన్షా” సినిమాలో మెయిన్ విలన్ గా బిగ్ బి నే డామినేట్ చేసారంటే, ఆ విలన్ పాత్రలో ఎంత బాగా నటించారో మనం అర్ధం చేస్కోవచ్చు.

ఈయన దాదాపు 400 సినిమాలకు పైగా వివిధ భాషల్లో నటించారు. ఈయన చేసిన పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉండడానికి కారణం… ఈయన పాత్రలకు ఈయనే డబ్బింగ్ చెప్పుకోవడమే. ఈయన చేసిన సినిమాల్లో హీరో డైలాగ్స్ కంటే, ఈయన డైలాగ్స్ కే ప్రేక్షుకులు మంత్రముగ్దులయ్యేవారు.

వెండితెరపై అమ్రిష్ పూరి లేని లోటును పూర్చేవారు ఎవ్వరూ లేరు.. రాలేరు.. రాబోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here