జయదేవ్” ట్రైలర్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కుమారుడు గంటా రవి, జయంత్ C పరాన్జీ దర్శకత్వంలో “జయదేవ్” అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్స్, సాంగ్స్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 1:52 సెకండ్స్ నిడివిగల థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా “మెగా స్టార్ చిరంజీవి” గారు హాజరవుతుండడంతో  ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘సేతుపతి’ చిత్రాన్ని తెలుగులో ‘జయదేవ్’ గా రీమేక్ చేశారు.
గంటా రవి సరసన మాళవిక రాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మూల కథను అరుణ్ కుమార్ సమర్పించగా, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ను పరుచూరి బ్రదర్స్ అందించారు. సినిమాటోగ్రఫీని జవహర్ రెడ్డి అందించగా, ఎడిటర్ గా మార్తాండ్ K వెంకటేష్ బాధ్యతలను నిర్వర్తించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, జయంత్ C పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ కుమార్ నిర్మించారు. ఇక ఈ సినిమా పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here