దీపావళికే పవన్ సినిమా

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్, తదితర పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో రాజకీయ ప్రవేశం ఉన్నందువలన పవన్ తాను ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా ను కూడా షెడ్యూల్ టైం లో పూర్తి చేయమని త్రివిక్రమ్ కు చెప్పాడట.

ఇందులో పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. జల్సా, అత్తారింటికి దారేది తరువాత, మూడవసారి జతకట్టిన ఈ కాంబినేషన్ కోసం పవన్ మరియు త్రివిక్రమ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దసరా కు విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను మరొక తేదికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా దసరా బరిలోకి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ దసరా పండుగకి కూడా మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా, దానితో పాటుగా బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్ ‘ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందుకోసం త్రివిక్రమ్, తన సినిమాను దసరా కు కాకూండా దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాగా, పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తాడో లేక పోటీతో వస్తాడో తెలియాలంటే కాస్త వేచిఉండాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Y6Pyf1ZNNWs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here