తమన్నా ను కాదని ‘క్వీన్’ అయిన కాజల్!

ఆఫర్లు తగ్గిపోయి కెరియర్ నెమ్మదిగా సాగుతున్న సమయంలో.. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో మరలా తిరిగి ఊపందుకుంది కాజల్ అగర్వాల్. దాదాపుగా తమిళ.. తెలుగు భాషల్లో అందరి స్టార్ హీరోస్ సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ ను అందుకుంది.

బాలీవుడ్ లో కంగనా రనౌత్ కి జాతీయ అవార్డు ను తెచ్చి పెట్టిన ‘క్వీన్’ సినిమాను దక్షిణాదిన రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా సౌత్ రీమేక్ రైట్స్ నటుడు మరియు ప్రొడ్యూసర్ అయిన త్యాగరాజన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన తమిళ్ లో ఈ సినిమాలు రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు.

మొదటగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ పాత్రను ఇక్కడ భర్తీ చేసేందుకు తమన్నాను అప్రోచ్ అయ్యారట. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల తమన్నాను తప్పించినట్లు తెలుస్తుంది. అందువలన ఈ ఛాన్స్ కాజల్ అగర్వాల్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. కెరియర్ ను స్పీడ్ పెంచిన కాజల్ ప్రస్తుతం తమిళం లో రెండు సినిమాలు .. తెలుగు లో ‘నేనే రాజు నేనే మంత్రి ‘ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా, తాజాగా కళ్యాణ్ రామ్ సరసన ‘ఎమ్మెల్యే’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే కాజల్ అగర్వాల్ మరలా సౌత్ లో బిజీ..బిజీ అయిందన్నమాట.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=33551pncHp8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here