‘రూలర్’ టీజర్ రిలీజ్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ వయసు సగానికి తగ్గినట్టు వుంది ఆ పోస్టర్లలో. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.

మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జై సింహా` మంచి హిట్ కొట్టింది.. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొడతారేమో చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here