గూగుల్ ఇండియా ట్రెండింగ్ లో ఒలీవియా మోరిస్ నేమ్

Olivia Morris Topped On Google India Search Results,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Olivia Morris Second Most Searched on Google,Olivia Morris Second Most Searched Keyword on Google,Google India Search Keyword

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ #RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూవీ షూటింగ్ 70%కంప్లీట్ అయినట్టు సమాచారం. రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జంటగా నటించే హాలీవుడ్ నటి
ఒలీవియా మోరిస్ పేరును రాజమౌళి నిన్న వెల్లడించారు.

ప్రేక్షకులలో ఉత్కంఠ ను పెంచి తన మూవీ గురించి ఎదురుచూసేలా చేయడం దర్శకుడు రాజమౌళి శైలి. బాహు బలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అంటూ బాహుబలి 2 మూవీ పై రాజమౌళి ఆసక్తి రేకెత్తించారు . కొన్ని నెలలుగా ఎన్టీఆర్ కు జంటగా నటించే నటి ని అనౌన్స్ చేయకుండా రాజమౌళి ప్రేక్షకులను సస్పెన్స్ లో పెట్టారు. ఎన్టీఆర్ కు జంటగా నటించే హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ పేరును రాజమౌళి అనౌన్స్ చేయగానే నిన్న ఒక్క రోజే ఆ పేరును రెండు లక్షల మంది గూగుల్ లో సెర్చ్ చేయడం విశేషం.ఒలీవియా మోరిస్ పేరు గూగుల్ ఇండియా టాప్ ట్రెండింగ్ లో చేరింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here