మెలోడీ బ్ర‌హ్మ ఖాతాలో ‘అసుర‌న్’ రీమేక్‌?

Melody Brahma Mani Sharma To Compose Music For Asuran Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mani Sharma Latest News,Mani Sharma Upcoming Movie,Mani Sharma Music For Asuran Remake,Music Director Mani Sharma Compose Music For Asuran Remake

కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `అసుర‌న్`… తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో అనుష్క నాయిక‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని టాక్‌. డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే… నేప‌థ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్య‌మున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స్ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే మ‌ణి ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంక‌టేష్ కాంబినేష‌న్ లో మ‌ణిశ‌ర్మ ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ అందించారు. గ‌ణేష్ (1998), శీను (1999), దేవీపుత్రుడు, ప్రేమ‌తో… రా(2001), సుభాష్ చంద్ర‌బోస్ (2005)… వంటి సినిమాలు ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఆడియో ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. అలాగే వెంకీ హీరోగా రూపొందిన `ల‌క్ష్మీ`, `చింత‌కాయ‌ల ర‌వి`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీత‌మందించారు. మ‌రి… సుదీర్ఘ విరామం త‌రువాత వెంకీ, మ‌ణి జట్టుక‌డుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =