‘శివ నిర్వాణ’ తర్వాతే ‘హీరో’ అంటున్న విజయ్..!

Latest Update about Vijay Deverakonda Upcoming Movies,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijay Deverakonda Upcoming Movies,Actor Vijay Deverakonda New Movies,Vijay Deverakonda Latest News

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్ లో `ఫైట‌ర్‌`, అలాగే ఆనంద్ అన్నామ‌లై డైరెక్ష‌న్‌లో `హీరో` కూడా విజయ్ ఖాతాలో వున్నాయి. దీనితో పాటు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. 2020 వేస‌వి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతునట్టు తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం పూరీ సినిమా తర్వాత విజయ్ ‘హీరో’ సినిమాను పూర్తిచేయవలసి వుంది. కానీ శివ నిర్వాణ సినిమా తరువాతనే ‘హీరో’పై దృష్టిపెట్టాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నాడట. నిజానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ‘హీరో’ చేయాలి. కానీ మధ్యలో పూరీ సినిమా వచ్చేసింది. ఇప్పుడు శివ నిర్వాణ సినిమా వచ్చింది. మరి వున్నాకొద్ది హీరో సినిమా వెనక్కి వెళుతుంది..ఆఖరికి సెట్స్ పైకి వెళ్లేసరికి ఎంత కాలం పడుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =