ప్రేమక‌థ‌ల్లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన‌ ‘ప్రేయసి రావే’కు 20 ఏళ్ళు

Srikanth Raasi Starrer Preyasi Raave Completes 20 Years,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Preyasi Raave Movie Completes ,20 Years for Preyasi Raave Movie,Srikanth Preyasi Raave Telugu Movie

ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అది ఒక మహా సముద్రం. దాని గురించి చెప్పే కొద్దీ కొత్త కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆకర్షణ, కోపం, ఇష్టం, బాధ, విసుగు, నవ్వు… ఇలా సకల భావోద్వేగాల మేళవింపే ప్రేమ‌. కాబట్టే తెలునాట‌ పలు ప్రేమకథా చిత్రాలు అలరించాయి. అలరిస్తూనే ఉంటాయి. అయితే… రొటీన్‌కు భిన్నంగా సాగే ప్రేమకథలు మాత్రం చాలా అరుదుగా వ‌స్తూ ఉంటాయి. అలా వ‌చ్చిన అరుదైన ప్రేమకథలలో ‘ప్రేయసి రావే’ ఒకటి. ప్రేమక‌థ‌ల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి నాయకానాయికలుగా నటించారు. అంతేకాదు… త‌మ అద్భుత‌ అభిన‌యంతో పాత్ర‌ల‌కు జీవం పోశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పృథ్వీరాజ్, సంఘవి, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, ఎం.ఎస్.నారాయణ, శ్రీహరి, రమాప్రభ, శివాజీరాజా, స‌న‌ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా… మెగా బ్రదర్ నాగబాబు, మూవీ మొఘ‌ల్ డా!!డి.రామానాయుడు అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో చంద్రమహేష్ దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు.

ఎం.ఎం.శ్రీలేఖ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ అల‌రించాయి. ముఖ్యంగా “నీకోసం నీకోసం జీవించా చిలకా”, “మేనకవో ప్రియ కానుకవో”, “ప్రేమంటే నేడు తెలిసినది”, “ఓ ప్రేమ నా ప్రేమ”, “తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం” వంటి గీతాలు విశేషాదరణ పొందాయి. 1999 నవంబర్ 19న విడుదలై ఘనవిజయం సాధించిన ‘ప్రేయసి రావే’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =