‘అసురన్’ రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాల..?

Noted Director to Remake Asuran,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Asuran Telugu Remake Director,Asuran Telugu Remake,Asuran Remake Director,Asuran Remake Updates

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘అసురన్’ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అన్నీ సెట్ అయ్యాయి కానీ ఈ సినిమాను తీసే డైరెక్టర్ మాత్రం దొరకలేదు. ఇప్పటికే ఓంకార్ పేరు తెరపైకి వచ్చింది.. ఆ తర్వాత మరో డైరెక్టర్ పేరు.. ఇక రీసెంట్ గా రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి షో వేశారు. సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలనుకున్నారు అదీ అయిపోయింది. అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకి దర్శకుడిగా కొంతమంది పేర్లను పరిశీలించినా చివరికీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కూడా కేవలం వార్త మాత్రమేనా..? లేక నిజముందా తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 11 =