బ్లాక్ బస్టర్ సక్సెస్ – నాలుగో వారంలోకి ‘ఖైదీ’

Khaidi Enters into Successful 4th Week,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthi Khaidi Successful Movie,Karthi Khaidi Movie Successful Running,Khaidi Movie Collections

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా… దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించిం తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా 100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. కార్తీ సినీ కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నా ఏ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరలేదు. ఫస్ట్ టైం ఖైదీ ఆ లోటును కూడా తీర్చింది. ఇక సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా నాలుగో వారంలోకి కూడా అడుగుపెట్టింది.

ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్, పాటలు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవు. అంతే కాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే. మొత్తానికి ఇన్ని రోజులు మంచి హిట్ కోసం ఎదురుచూసిన కార్తికి ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్టే ఇచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =