ఇంట్రెస్టింగ్ లైన‌ప్ సెట్ చేసుకున్న సూర్య‌

Sensational Actor Suriya Chooses Interesting Lineups, Actor Suriya Future Projects,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,Suriya Upcoming Interesting Movies,Suriya New Movie Details

పేరుకి త‌మిళ క‌థానాయ‌కుడైనా తెలుగులోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు సూర్య‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. ఈ ఏడాది `ఎన్జీకే`, `బందోబ‌స్త్‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్… ప్ర‌స్తుతం `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`)లో న‌టిస్తున్నాడు. ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేస‌విలో తెర‌పైకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాని పూర్తిచేసే ప‌నిలో ఉంటూనే… మ‌రోవైపు ఇంకో ఐదు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను లైన్ లో పెట్టాడు సూర్య‌. ఇవ‌న్నీ కూడా స్టార్ డైరెక్ట‌ర్స్ కాంబినేష‌న్ మూవీలే కావ‌డం విశేషం. హ‌రి (`య‌ముడు` సిరీస్ ఫేమ్‌), `శౌర్యం` శివ‌, గౌత‌మ్ మీన‌న్‌, వెట్రిమార‌న్ (`అసుర‌న్` ఫేమ్‌), లోకేష్ క‌న‌క‌రాజ్ (`ఖైదీ` ఫేమ్‌)తో ఈ ఐదు వ‌రుస చిత్రాలు చేయ‌బోతున్నాడు. అలాగే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంద‌ని టాక్‌. మ‌రి… రాబోయే ఈ చిత్రాల‌తో సూర్య మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =