‘మిస్ మ్యాచ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Mismatch Movie Release Date Confirmed,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,Mismatch Movie Release Date,Mismatch Movie Release Date Updates,Mismatch Movie Latest News

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్, నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =