శింబు, జ్యోతిక, సింధుతులానీ కాంబినేషన్ లో వచ్చిన ‘మన్మథన్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిదనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో మన్మథ పేరుతో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. ఇక ఈ సినిమాతోనే శింబుకు పాపులారిటీ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత ఉపోద్గాతం ఎందుకనుకుంటున్నారా…? అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు మళ్ళీ సీక్వెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శింబుకి సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ మధ్య కొన్ని సినిమాలో హీరో గా కాకుండా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నా.. హీరోగా చాలా కాలంగా ఒక మంచి హిట్ కొట్టాలనిచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘మన్మథన్’ సీక్వెల్‌తో మళ్లీ శింబు ఫామ్ లోకి రావడానికి చూస్తున్నాడట. మరి ఇవి రూమర్స్ మాత్రమేనా ‘మన్మథన్’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుందా లేదా అంటే వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: