తమిళ్ చాలా కష్టంగా వుంది..!

Kangana Ranaut about Tamil Language,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,Tamil Language Is Tough Says Kangana Ranaut,Kangana Ranaut struggles to learn Tamil,Thalaivi Movie Updates

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే కంగనా తమిళ్, అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కంగనా తమిళం భాషపై మాట్లాడుతూ.. త‌మిళం నేర్చుకోవ‌డం చాలా కష్టం… క‌ష్ట‌మైన‌ప్ప‌టికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను. డైలాగులు ఈ చిత్రంలో కీల‌కం కానుండ‌గా, ప‌లు డైలాగుల‌ని కంఠ‌స్తం చేస్తున్నాను. ఎప్ప‌టి నుండో త‌మిళం నేర్చుకోవాల‌ని అనుకున్నాను. ఈ చిత్రం ద్వారా అది నెర‌వేరింది అని కంగ‌నా తెలిపింది. చూద్దాం మరి కంగనా ఎలా తమిళ్ మాట్లాడిందో..

కాగా ఈ సినిమాలో ఇంకా జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఏం పాత్రలు పోషిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సినిమా 2020 మేలో రిలీజ్ చేసే యోచనలో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =