ఏ క్యాలెండర్ ఇయర్‌లోనైనా సరే… కథానాయకులందరూ వెండితెరపై హాజరు పలికితేనే కనువిందుగా ఉంటుంది. అయితే, ఇది అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటుంది. భారీ బడ్జెట్ చిత్రాల కోసం కాల్షీట్స్ కేటాయించడం… లేదంటే అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాకపోవడం… అదీ కాదంటే పరాజయాలతో పునరాలోచనలో పడి సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకోవడం… ఇలాంటి కారణాలతో ప్రతీ ఏడాదిలోనూ కొందరు `మిస్సింగ్ స్టార్స్` ఉంటారు. అలా… 2019లోనూ మిస్సింగ్ స్టార్స్ ఉన్నారు. ఆ తారల గురించి క్లుప్తంగా…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ యన్టీఆర్:
గత ఏడాది `అరవింద సమేత`తో సందడి చేసిన యన్టీఆర్… ఆ తరువాత రాజమౌళి మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` కోసం భారీగా కాల్షీట్స్ కేటాయించాడు. ఫలితంగా… 2019 సంవత్సరం తారక్‌కి `జీరో రిలీజ్ ఇయర్`గా మిగిలిపోయింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో `ఆర్ ఆర్ ఆర్`తో మళ్ళీ వెండితెరపై వెలుగులు పంచనున్నాడు ఈ నందమూరి హీరో.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్:
ఎంతో ఇష్టపడి, మరెంతో కష్టపడి చేసిన `నా పేరు సూర్య` నిరాశపరచడంతో… తదుపరి చిత్రాల ఎంపిక విషయంలో అల్లు అర్జున్ మరింత శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ఫలితంగానే… 2019 సంవత్సరం బన్నీకి `జీరో రిలీజ్ ఇయర్`గా నిలచిపోయింది. అయితే, వచ్చే సంవత్సరం సంక్రాంతికి `అల వైకుంఠపురములో`తోనూ… ద్వితీయార్ధంలో సుకుమార్ కాంబినేషన్ ఫిల్మ్‌తోనూ వినోదాలు పంచనున్నాడు బన్నీ.
మాస్ మహారాజా రవితేజ:
పోయినేడాది మూడు చిత్రాలతో పలకరించిన రవితేజ… ఆ మూడు సినిమాలు కూడా నిరాశపరచడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేశాడు. ఫలితంగానే… 2019 `జీరో రిలీజ్ ఇయర్`గా మిగిలిపోయింది. వాస్తవానికి రవితేజ అప్‌కమింగ్ ఫిల్మ్ `డిస్కో రాజా`ని డిసెంబర్ 20కి విడుదల చేయాలని ప్లాన్ చేసినా… విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా 2020 జనవరి 24కి వాయిదా పడింది. దీంతో… ఈ సంవత్సరం రవితేజ మార్క్ వినోదాలను మిస్ కాక తప్పలేదు.
నితిన్:
గత ఏడాది విడుదలైన రెండు సినిమాలు కూడా నిరాశపరచడంతో… నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేశాడు నితిన్. ఫలితంగానే 2019 అతనికి `జీరో రిలీజ్ ఇయర్`గా నిలచిపోయింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం మూడు చిత్రాలతో పలకరించబోతున్నాడు నితిన్. వీటిలో `భీష్మ` ఫిబ్రవరి 21న రానుండగా… `రంగ్ దే` వేసవిలో సందడి చేయనుంది. ఇక చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ ఫిల్మ్ సెకండాఫ్‌లో రిలీజ్ కానుంది.
సుధీర్ బాబు:
కిందటేడాది `సమ్మోహనం`, `నన్ను దోచుకుందువటే` చిత్రాలతో పలకరించిన సుధీర్ బాబు… ఈ సంవత్సరం ఒక్క సినిమాతో కూడా సందడి చేయలేదు. అయితే 2020 ఉగాదికి `వి`తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుధీర్.
2019ని మిస్ అయిన ఈ స్టార్స్ అందరూ… 2020లో తమ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్లాక్‌బస్టర్స్ అందుకోవాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: