కోర్టు స‌న్నివేశాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’

RRR Movie Begins Court Scenes Shooting Schedule,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RRR Movie Court Scenes,Rajamouli RRR Movie Shooting Schedules,RRR Movie Latest News

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్‌గా తార‌క్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిల్మ్ సిటీలో అల్లూరి పాత్రధారి చరణ్‌ను బ్రిటిష్ న్యాయస్థానం ప్రశ్నించే కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మ‌రో రెండు రోజుల పాటు సాగే ఈ ఎపిసోడ్‌లో చరణ్‌తో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. కాగా… నెక్ట్స్ షెడ్యూల్‌లో తార‌క్, చ‌ర‌ణ్ పై కీల‌క ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తార‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం. అంతేకాదు… ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దార‌ని… అందులోనే దాదాపు 60 శాతం షూటింగ్ ప్లాన్ చేసార‌ని టాక్.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని డిసెంబర్ 31న లేదా జ‌న‌వ‌రి 1న విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలిసింది. అదే స‌మ‌యంలో… టైటిల్ అబ్రివేష‌న్ (`ఆర్ ఆర్ ఆర్` పూర్తి పేరు) రివీల్ చేస్తార‌ని స‌మాచారం.

స్వ‌ర‌వాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని డీవీవీ దానయ్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 2020 జూలై 30న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 13 =