సొంత ప్రొడక్షన్ లో యంగ్ హీరో సినిమా – క్లారిటీ ఇచ్చిన రానా..!

Rana Daggubati Gives Clarity About His Own Production,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rana Daggubati Own Production,Rana Daggubati Next Upcoming Film,Rana Daggubati Latest News

గతకొద్ది కాలంగా బ్రేక్ లో వున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా ఇప్పుడు మళ్ళీ బిజీ కాబోతున్నాడు. ఇప్పటి వరకూ పెండింగ్ లో వున్న పనులతో బిజీ కాబోతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. హిందీ మూవీ హాథీ మేరే సాథీ మూవీ కి డబ్బింగ్ చెబుతున్నాను.. ఆ మూవీ మూడు భాషలలో రిలీజ్ కానుందని, మూడు భాషలలో డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదు.. మరోపక్క హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్నాను.. ఆ మూవీ కై కొన్ని సెట్స్ రూపొందిస్తున్నాం.. డిసెంబర్ నెలలో విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతే కాదు తన సొంత ప్రొడక్షన్ పై వస్తున్న సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చేసాడు. రాజ్ తరుణ్ హీరోగా రానా ప్రొడక్షన్ లో సినిమా రాబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక దీనిపై కూడా మాట్లాడుతూ…ప్రస్తుతం రాజ్ తరుణ్ వేరే సినిమాతో బిజీ గా వున్నాడు.. అది అయిపోయినా తరువాత జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని రానా క్లారిటీ ఇచ్చేసాడు. తెలుగు హిందీ లో తెరకెక్కతున్న ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ నిర్మించనున్నాడు. మరాఠిలో ఘన విజయం సాధించిన కామెడీ ఫిలిం పోస్టర్ బాయ్స్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. కొత్త దర్శకుడితో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. చూద్దాం మరి అవుతుందా..?లేక వేరే కథను తీసుకుంటారా..?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eighteen =