మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన‌ కృష్ణవంశీ, ఇళ‌య‌రాజా

Krishna Vamsi Teams Up Again With Maestro Ilayaraja For Rangamarthanda,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rangamarthanda Music Director,Maestro Ilayaraja Upcoming Projects,Krishna Vamsi Rangamarthanda Movie

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ… తెలుగు చిత్ర‌ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. ఏ త‌ర‌హా క‌థాంశాన్నైనా ఆక‌ట్టుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… సంగీతపరంగానూ మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే కృష్ణవంశీ తెరకెక్కించిన పలు సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అటువంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ల‌లో ‘అంతఃపురం’(1998) ఒకటి. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన ఆ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. క‌ట్ చేస్తే… రెండు ద‌శాబ్దాల త‌రువాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మ‌రో సినిమా కోసం జ‌ట్టుక‌ట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’(2016)కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకే ఇళయరాజా స్వరాలు సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్ర‌స్తుతం… మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్న‌ట్టు భోగ‌ట్టా. మ‌రి… ‘అంతఃపురం’ త‌ర‌హాలో ‘రంగమార్తాండ’ కూడా మ్యూజికల్ గానూ, క‌మ‌ర్షియ‌ల్ గానూ రంజింప‌చేస్తుందేమో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =