రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు అప్ డేట్ వస్తుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు..ఇటు చెర్రీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు చెర్రీ. మొన్నటివరకూ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ పై చెర్రీ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షూటింగ్ కు కారులో వెళ్తూ.. రామోజీ ఫిలిం సిటీ లో ఉదయం షూటింగ్లకు రావడం ఎంతో బావుంటుంది.. మార్నింగ్ షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని వీడియో తీసి పోస్ట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: