‘కార్తికేయ 2’ కోసం భారీ బడ్జెట్

Karthikeya 2 Movie To Have A Huge Budget,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthikeya 2 Movie Budget,Karthikeya 2 Telugu Movie Budget,Karthikeya 2 Movie Updates

చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. కార్తికేయ తో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ ఐన సంగతి కూడా విదితమే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెటే పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రూ.15 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట నిర్మాతలు. ఈ సినిమాను ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉందట. అలాగే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఇవన్నీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి బడ్జెట్ కు ఏమాత్రం వెనుకాడకుండా అంత బడ్జెట్ కేటాయించారట నిర్మాతలు.

కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =