క‌థానాయ‌కుడిగా అఖిల్ న‌ట‌నాప్ర‌స్థానానికి నాలుగేళ్ళు

Sisindri Actor Akhil Completes 4 Years In Telugu Film Industry,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Akhil Completes 4 Years In TFI,4 Years of Actor Akhil Film Carrer,Sisindri Completes 4 Years,Akkineni Akhil Latest News 2019

బుడిబుడి అడుగుల ప్రాయంలోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న వైనం అఖిల్ అక్కినేని సొంతం. `సిసింద్రీ`(1995)గా మెస్మ‌రైజ్ చేసిన ఈ స్టార్ కిడ్‌… స‌రిగ్గా 20 ఏళ్ళ త‌రువాత క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. త‌న పేరుతోనే రూపొందిన `అఖిల్‌`(2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో త‌రం క‌థానాయ‌కుడు… మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా అల‌రించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి అక్కినేని నాగార్జున త‌ర‌హాలో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకునే క్ర‌మంలో… తొలి మూడు చిత్రాల‌తో ఆశాజ‌న‌క ఫ‌లితాలు అందుకోలేక‌పోయినా న‌టుడిగా మాత్రం చిత్ర‌చిత్ర‌ప్ర‌వ‌ర్థ‌మానంగా ఎదుగుతున్నాడు అఖిల్‌. అలాంటి అఖిల్ కి ఈ రోజు (న‌వంబ‌ర్ 11) ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే… స‌రిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే తేదిన త‌ను హీరోగా న‌టించిన తొలి చిత్రం `అఖిల్‌` విడుద‌లైంది. అంటే… క‌థానాయ‌కుడిగా నేటితో అఖిల్ నాలుగు వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటున్నాడ‌న్న‌మాట‌.

ఈ సంద‌ర్భంగా… మున్ముందు అఖిల్ మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని ఆశిద్దాం. అలాగే, రాబోయే చిత్రంతో `సిసింద్రీ` త‌రహాలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =