20వ వ‌సంతంలోకి ‘చిరునవ్వుతో’

20 Years For Super Hit Movie Chirunavvutho,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,20 Years For Chirunavvutho Movie,Chirunavvutho Movie Completes 20 Years,Chirunavvutho Telugu Movie,Trivikram Chirunavvutho Movie

జీవితంలో ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా వాటిని చిరున‌వ్వుతో అధిగ‌మిస్తూ ముందుకు సాగాల‌ని చాటి చెప్పిన చిత్రం `చిరున‌వ్వుతో`. “ప్రేమించడం కంటే… ప్రేమించబడటం గొప్ప” అనే కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో… వేణు, షహీన్ జంట‌గా నటించారు. ప్రేమ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సునీల్, గిరిబాబు, బ్రహ్మానందం, అలీ, సుధ, ప్రియ‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జి.రామ్ ప్రసాద్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట‌ శ్యామ్ ప్రసాద్ ఈ ఫీల్ గుడ్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, మాటలు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. అలాగే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేయ‌గా… “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ వీనుల విందైన బాణీలు అందించారు. “సంతోషం సగం బలం హాయిగా న‌వ్వ‌మ్మా”, “చిరునవ్వుతో” (బిట్ సాంగ్‌), “నిన్నలా మొన్నలా”, “సోనారే సోనారే” గీతాలు సంద‌ర్భానుసారంగా సాగితే… “అందం నీ పేరా”, “కనులు కలిసాయే”, “హోయ్యారే” వంటి పాటలు ఊహాత్మ‌కంగా ఉంటాయి.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నూత‌న‌ దర్శకుడు(జి.రామ్ ప్రసాద్), ఉత్తమ స్క్రీన్‌ప్లే(జి.రామ్ ప్రసాద్), ఉత్తమ మాటల రచయిత(త్రివిక్రమ్) వంటి విభాగాలలో “నంది” పురస్కారాలను అందుకోవ‌డ‌మే కాకుండా… ఉత్తమ సంగీతదర్శకుడు (మణిశర్మ) కేట‌గిరీలో ఫిల్మ్‌ఫేర్‌ను కూడా కైవసం చేసుకుందీ చిత్రం. ఈ సినిమాని కన్నడంలో ‘ప్రేమక్కే సై’ (సి. అశ్వ‌నీద‌త్ నిర్మాణం, ఎ.కోదండ‌రామి రెడ్డి ద‌ర్శ‌క‌త్వం) పేరుతోనూ, తమిళంలో ‘యూత్’ టైటిల్‌తోనూ పునర్నిర్మించగా… ఈ మూడు చిత్రాలలోనూ ష‌హీన్ నాయిక‌గా న‌టించ‌గా, మణిశర్మ సంగీతం అందించడం విశేషం. 2000 నవంబర్ 10న విడుదలై ఘనవిజయం సాధించిన ‘చిరునవ్వుతో’… నేటితో 19 ఏళ్ళ‌ను పూర్తి చేసుకుని 20వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =