విశాల్ సినిమాలో గౌతమి?

విశాల్ క‌థానాయ‌కుడిగా మిస్కిన్ రూపొందించిన యాక్ష‌న్ క్రైమ్ థిల్ల‌ర్ `తుప్ప‌రివాల‌న్‌` (తెలుగులో ‘డిటెక్టివ్’). 2017లో విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. క‌ట్ చేస్తే… రెండేళ్ళ త‌రువాత‌ ఈ సినిమాకి సీక్వెల్ గా ‘తుప్పరివాలన్ 2’ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మిస్కిన్. విశాల్ కి జంట‌గా ఆశ్య అనే నూత‌న క‌థానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకి ఇళ‌య‌రాజా బాణీలు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతోంది. 40 రోజుల పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… తొలి భాగంలో సీనియ‌ర్ యాక్ట్ర‌స్‌ సిమ్రాన్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌గా, సీక్వెల్ లో మ‌రో సీనియ‌ర్ హీరోయిన్‌ ముఖ్య పాత్ర‌లో నటించ‌బోతోంద‌ట‌. ఆమె మ‌రెవ‌రో కాదు… గౌత‌మి. ద‌క్షిణాదిన న‌టిగా చెర‌గ‌ని ముద్ర వేసిన గౌత‌మి… `పాప‌నాశం` (2015) త‌రువాత న‌టిస్తున్న త‌మిళ చిత్ర‌మిదే కావ‌డం విశేషం. మ‌రి… నాలుగేళ్ళ గ్యాప్ త‌రువాత త‌మిళ‌నాట గౌత‌మి న‌టిస్తున్న ఈ సినిమా త‌న‌కి ఎలాంటి గుర్తింపు తీసుకువ‌స్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =