‘రుద్రవీణ’ పాటతో పవన్ పొలిటికల్ సెటైర్

Pawan Kalyan Political Satire Song,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Pawan Kalyan Political Song,Political Satire Songs,Pawan Kalyan Songs,janasena pawan kalyan political songs

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అభిమానులను నిరాశపరుస్తూ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. అంతేకాదు ఇకపై సినిమాలు తీయమని మరో బాంబు పేల్చారు. ఇక ఎన్నికలు అయిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ‘పింక్’ రీమేక్ చేస్తున్నట్టు టాక్స్ వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇదిలా ఉండగా రీసెంట్ అధికార పక్షంపై నిరసనను తెలుపుతూ లాంగ్ మార్చ్ చేసిన పవన్ ఇప్పుడు మరోసారి అధికార పక్షంపై సెటైర్ లు వేశారు. ఇప్పటి వరకు మాటలతో విమర్శల దాడి చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి ట్విట్టర్ వేదికగా మరో సెటైర్ వేశారు. అయితే, సినిమా స్టైల్లో ఉండడం విశేషం. చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ సినిమాలో ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’ అనే పాటను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ఏసీపీ పై సెటైర్ వేశారు.

ఒక పక్క రోజు వారీ కూలీలు అందక కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోపక్క నెల నెల తమ జీతాలు తీసుకుంటున్న వైసీపీ లీడర్స్ కు మేల్కొలిపే పాట ఇదని తెలిపారు. ఇంకా ఈ సినిమా తీయడానికి స్ఫూర్తి సోషల్ యాక్టివిస్ట్ ‘అన్నా హజారే’ గారే నిదర్శనమే అని.. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారని.. సిరి వెన్నెల సీత రామశాస్త్రి మంచి లిరిక్స్ అందించారని చెప్పారు. అంతే కాదు ఈ పాట ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితికి సరిగా సరిపోతుందని.. వైసీపీ మేనిఫెస్టోను నమ్మి ఓటు వేసిన ప్రజలను జాగృతం చేసేందుకు ఈ పాట సరిగ్గా సరిపోతుందన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =