నవ్వించినా… ఏడిపించినా ఈయనకే సాటి..!

Interesting Facts About Trivikram Srinivas,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Trivikram Srinivas Facts 2019,Trivikram Srinivas Unknown Facts,Trivikram Srinivas Success Story

ఆకెళ్ళ నాగ శ్రీనివాస వర్మ… ఈ పేరు ఎవరిదబ్బా అని అనుకుంటున్నారా..? అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పండి ఎవరికైనా అర్ధమవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు, రచయితలు వున్నా త్రివిక్రమ్ స్టైల్ వేరు. పంచులు, ప్రాసలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే త్రివిక్రమ్ అనే చెబుతారు ఎవరైనా.. తన పంచులు ప్రాసలతో నవ్విస్తాడు.. ఎమోషనల్ డైలాగ్స్ తో కన్నీళ్లు పెట్టిస్తాడు.. సందేశాత్మక సన్నివేశాలతో ఆలోచింపచేస్తాడు.. తన కలం నుండి రాలే ప్రతి అక్షరానికి కొత్త అర్ధం వస్తుంది. చాలా సరళమైన.. మనకు అర్ధమయ్యే భాషలోనే మనిషి విలువలు గురించి చెప్తాడు. అలా అని పేరాల పేరాలు డైలాగ్స్ ఉంటాయా అంటే తప్పే.. చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఉంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజం చెప్పక పోవడం అబద్దం…అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.. యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు…ఓడించడం.. మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి…కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్.. అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు…జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు… కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం… బాధ్యత లేని యవ్వనం…జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం.. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా…ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు… ఇలాంటి అని ముత్యాలు రాయాలంటే ఒక్క త్రివిక్రమ్ వల్లనే అవుతుంది.

నవంబర్ 7న భీమవరంలో పుట్టిన త్రివిక్రమ్ కు చిన్నప్పటినుండీ సినిమాలంటే ఇష్టమే. కానీ తన చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత టీచర్ గా చేసి సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ కు వచ్చేసాడు. అయితే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్నా… గుర్తింపు రావాలన్నా ఎంత కష్టమో మనకు తెలిసిందే. సినిమాల్లో చూపించేటట్టే ఆ కష్టాలను అనుభవించాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగాడు.

మొదట పోసాని దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరిన త్రివిక్రమ్ తక్కువ కాలంలో సొంతంగా సీన్లు, డైలాగులు రాసే స్థానానికి ఎదిగాడు. ఆ తర్వాత దర్శకుడు విజయ్ భాస్కర్ తో పరిచయం తన కెరీర్ నే మార్చేసింది. స్వయంవరం తో రైటర్ గా మారి ఆ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మారాడు. ఆ తర్వాత సిందూరం, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, వాసు, మల్లీశ్వరి వంటి సినిమాలకు పనిచేసాడు. వీటిలో దాదాపు అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో పాటు త్రివిక్రమ్ కు మంచి పేరొచ్చింది. నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

పెద్ద పెద్ద స్టార్స్ తో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. తనతో ఒక్క సినిమా అయినా తీయాలని హీరోలు సైతం కోరుకునే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా తీస్తున్నాడు. మరి ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా అయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని.. మనకు తన సినిమాల ద్వారా జీవిత పాఠాలు నేర్పాలని కోరుకుందాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =