మ‌రో మెగాహీరోతో సురేంద‌ర్ రెడ్డి?

Surender Reddy To Direct Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director Surender Reddy Latest News,Surender Reddy Upcoming Movie With Varun Tej,Varun Tej Next Film With Surender Reddy

మెగాఫ్యామిలీకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో సురేంద‌ర్ రెడ్డి ఒక‌రు. `రేసు గుర్రం` రూపంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి, `ధృవ‌`తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌కి… తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` రూపంలో మెగాస్టార్ చిరంజీవికి మెమ‌ర‌బుల్ మూవీస్ అందించిన వైనం సూరి సొంతం. ఈ నేప‌థ్యంలో… త్వ‌ర‌లో మ‌రో మెగాహీరోతో జ‌ట్టుక‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఆ హీరో మ‌రెవ‌రో కాదు … మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాస్త‌వానికి సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో ఉంటుంద‌నే వార్త‌లు వినిపించాయి. అయితే, వ‌చ్చే ఏడాది చివ‌రి వ‌ర‌కు ప్ర‌భాస్ కాల్షీట్స్ కోసం వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఉండ‌డంతో… ఈ లోపు వ‌రుణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ట సూరి. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. `ధృవ‌`, `సైరా`… ఇలా వ‌రుస‌గా రెండు సినిమాల‌ను మెగాకాంపౌండ్‌లోనే చేసిన సూరి… ఇప్పుడు అదే క్యాంప్‌లో హ్యాట్రిక్‌కి సిద్ధ‌మ‌వుతుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twelve =