`ప్ర‌భాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌…

Prabhas 20 Next Schedule To Begin in Ramoji Film City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prabhas Next Film Updates,Prabhas New Movie News,Prabhas Latest Movie Updates

`వ‌ర్షం`, `డార్లింగ్‌`… యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత ప్రేమ‌క‌థ‌ల‌కు దూర‌మైన ఈ ల‌వ‌బుల్ స్టార్‌… సుదీర్ఘ విరామం అనంతరం మ‌రో ప్ర‌ణ‌య‌గాథ‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అది కూడా ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో. 1970 నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా… `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన త‌దుప‌రి షెడ్యూల్ ఈ నెల 18 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఆపై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని టాక్‌. మ‌రి… ద‌శాబ్ద‌కాలం త‌రువాత ప్రేమ‌క‌థ‌తో వ‌స్తున్న ప్ర‌భాస్‌… మ‌రో బ్లాక్‌బ‌స్టర్‌ని త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =