విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏ ముహూర్తాన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొని వెళ్లారో కానీ పాపం ఈ రీమేక్ కు వచ్చినన్ని కష్టాలు మరే రీమేక్ కు రాలేదేమో అన్నట్టుంది ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ ను చూస్తుంటే. నిజానికి ఈ సినిమా కంటే వెనుక మొదలుపెట్టిన హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తమిళ్ రీమేక్ మాత్రం విడుదలకు నోచుకోలేదు.
మొదట ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ బాల డైరెక్ట్ చేశారు. అయితే అవుట్ ఫుట్ సరిగా లేదని మళ్ళీ రీ షూట్ చేయాల్సివచ్చింది. ఈ సారి తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన గిరీశాయ డైరెక్ట్ చేసాడు. ఎలాగో సినిమా పూర్తయింది. రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్ లకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక దాదాపు ఏడాదికి పైగా సెట్స్ పైన వున్న ఈ సినిమాను మొదట సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదర్లేదు. ఆ తర్వాత నవంబర్ 8 కు మార్చారు. అయితే ఇప్పుడు అది కూడా కష్టమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం సెన్సార్ అట. ఈ సినిమాకు తమిళ్ సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. అయితే ఈ సినిమాను అందరూ చూసే విధంగా చేయాలని నిర్మాతలు ఈ మూవీకి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేయవలసిందిగా సెన్సార్ వారిని కోరారట. ఇక ఈ ప్రాసెస్ అవ్వడానికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుండటంతో నిర్మాతలు ‘ఆదిత్య వర్మ’ చిత్ర విడుదల తేదీ వెనక్కి జరిపే ఆలోచనలో ఉన్నారట. ఆ కారణంతో కనీసం ఈ వారమైనా వస్తుందనుకున్న సినిమా.. మళ్లీ వాయిదా వేసుకోనున్నట్టు సమాచారం. మరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే వారమైన విడుదలవుతుందో..? లేదో..? ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాల్లాగా బ్లాక్ బస్టర్ అవుతుందో..? లేదో..?చూద్దాం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు నటిస్తుండగా… హీరోయిన్ ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ ఈ సినిమా కు కూడా సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: