మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘మ‌న‌సంతా నువ్వే’కు 18 ఏళ్ళు

Uday Kiran Manasantha Nuvve Completes 18 Years,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Manasantha Nuvve Completes 18 Years,Uday Kiran Manasantha Nuvve,Manasantha Nuvve Telugu Movie

ఉదయ్ కిరణ్… ఈ పేరు చెబితే పలు యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్ కళ్ళ ముందు కదలాడతాయి. ముఖ్యంగా, త‌న కెరీర్ ఆరంభంలో మూడు వరుస విజయాలతో “హ్యాట్రిక్ హీరో” అనిపించుకున్నాడు ఉద‌య్‌. ఆ హ్యాట్రిక్ మూవీస్‌లో మూడో చిత్ర‌మే ‘మనసంతా నువ్వే’. ఉద‌య్‌కిర‌ణ్‌కి జోడీగా రీమా సేన్ న‌టించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సునీల్, తను రాయ్, చంద్రమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ళ భరణి, సుధ, రజిత, మాస్ట‌ర్ ఆనంద్ వ‌ర్థ‌న్‌, బేబి జీబా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ గీత‌ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. ‘చిత్రం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఉద‌య్ కిర‌ణ్‌, రీమా సేన్‌ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా కూడా అదే బాట ప‌ట్ట‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ చిత్రంతోనే వి.ఎన్.ఆదిత్య దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలకు… ఆర్.పి.పట్నాయక్ అందించిన బాణీలు విశేషాదరణ పొందాయి. “తూనీగ తూనీగ”, “కిట కిట తలుపులు”, “చెప్పవే ప్రేమ”, “మనసంతా నువ్వే”, “నీ స్నేహం”, “ఎవ్వరినెప్పుడు”, “ఆకాశాన” … ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని హిందీ(‘జీనా సిర్ఫ్ మేరే లియే’), కన్నడం(‘మనసెల్లా నీనే’), తమిళ్(‘తిత్తిక్కుదే’), బంగ్లాదేశ్ బెంగాలీ(‘మొనేర్ మాజే తుమ్హీ’), ఒరియా(‘నీ జారే మెఘా మాటే’)… ఇలా ఐదు భాష‌ల్లో పున‌ర్నిర్మించారు. 2001 అక్టోబర్ 19న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘మనసంతా నువ్వే’… నేటితో 18 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =