మ్యూజికల్ సెన్సేష‌న్‌ ‘గోరింటాకు’కు 40 ఏళ్ళు

Sobhan Babu Gorintaku Movie Completes 40 Years,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Gorintaku Movie Completes 40 Years,Gorintaku Telugu Movie,40 Years for Gorintaku Movie

న‌ట‌భూష‌ణ్‌ శోభన్‌బాబు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కాంబినేష‌న్‌లో ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘గోరింటాకు’ ఒకటి. సుజాత, వక్కలంక పద్మ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ మ్యూజిక‌ల్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సావిత్రి, ప్రభాకర రెడ్డి, జె.వి.రమణమూర్తి, దేవదాస్ కనకాల, చలం, రమాప్రభ త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తి గీత రచన చేయగా… దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ వీనులవిందైన బాణీలు అందించారు. “గోరింటా పూచింది కొమ్మా లేకుండా”, “కొమ్మ కొమ్మకో సన్నాయి”, “ఎలా ఎలా దాచావు”, “చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది”, “ఇలాగ వచ్చి”, “పాడితే శిలలైన కరగాలి” వంటి పాటలు ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్స్‌గా నిలిచాయి. ఉత్తమ నటుడు(శోభన్‌బాబు), ఉత్తమ దర్శకుడు(దాసరి నారాయణరావు) విభాగాలలో `ఫిల్మ్ ఫేర్‌`ను కైవ‌సం చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను… యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై కాట్రగడ్డ మురారి నిర్మించారు. ఈ చిత్రం హిందీలో ‘మెహంది రంగ్ లాయేగి’(1982) పేరుతో రీమేక్ కాగా, దాస‌రినే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. 1979 అక్టోబర్ 19న విడుదలై ఘన విజయం సాధించిన `గోరింటాకు`… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here