అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన ‘సాహో’

2019 Telugu Full Movies, 2019 Telugu Movies Watch Online, Latest Movies on Amazon Prime, Latest Telugu Movies, Latest Telugu Online Movies, New Telugu Films 2019, saaho, saaho full movie, Saaho Movie, Saaho Telugu Full Movie, Saaho Telugu Full Movie On Amazon Prime, saaho telugu movie, Telugu Filmnagar, Telugu full length movies, Watch Online Telugu Movies

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక్కడితో పోల్చుకుంటే హిందీలో మాత్రం ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మంచి లాభమే కలుగుతుంది. ఈ రోజూ అమెజాన్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో సాహో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉండనుందని సమాచారం.

కాగా యూవీ క్రియేషన్స్‌ పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, లాల్‌, వెన్నెల కిశోర్‌, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరి ఇంకెందుకు ఆలస్యం కింద లింక్ క్లిక్ చేసి మూవీ చూసేయండి. 👇

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fifteen =